భారతీయులకు యూఎస్ ఎంబసీ గుడ్ న్యూస్

భారతీయులకు యూఎస్ ఎంబసీ గుడ్ న్యూస్

అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఆ దేశం గుడ్ న్యూస్ చెప్పింది. రెండేళ్ల విరామం తర్వాత వీసా ఇంటర్వ్యూలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. నవంబర్ మూడోవారం నుంచి స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు ప్రారంభించనున్నట్లు యూఎస్ ఎంబసీ ప్రకటించింది. డిసెంబర్ చివరి వారం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. వీటితో పాటు డ్రాప్ బాక్స్ కేసులకు సంబంధించి H అండ్ L వర్కర్ వీసాల జారీ ప్రక్రియను కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పింది. మొదటిసారి దరఖాస్తు చేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 

టూరిస్టులు, బిజినెస్ మేన్ లకు జారీ చేసే బీ 1, బీ 2 వీసాదారుల వెయిటింగ్ టైంను తగ్గించనున్నట్లు యూఎస్ కాన్సులర్ ఎఫైర్స్ మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీసాల కోసం 800 రోజులు వేచి చూడాల్సి వస్తోంది. మరోవైపు F, M . J కేటగిరీలకు వీసాల మంజూరులో  ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి 100శాతం సిబ్బందితో పనిచేసేందుకు కాన్సులేట్ చర్యలు తీసుకుంటోందని హెఫ్లిన్ స్పష్టం చేశారు.

కోవిడ్ కారణంగా అమెరికా రెండేళ్ల క్రితం వీసాలు మంజూరు చేయడం నిలిపివేసింది. దీంతో వేలాది మంది భారతీయులు అమెరికాలు వెళ్లలేకపోయారు. బీ1, బీ2 విజిటర్ వీసాలతో పాటు హెచ్1బీ, హెచ్ 4 వర్క్ పర్మిట్ వీసా దరఖాస్తులు భారీగా పెండింగ్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే వాలిడ్ F-1 స్టూడెంట్ వీసా కలిగిన విద్యార్థులు అమెరికా తిరిగి వెళ్లేందుకు అడిషనల్ వీసా స్టాంప్ లేదా ఇంటర్వ్యూ అవసరం లేదని యూఎస్ ఎంబసీ స్పష్టం చేసింది. వీసాల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయంపై భారతీయులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.