
మహమ్మారి కరోనా వైరస్ రోజు రోజుకు భీకరంగా మారుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5లక్షల 32 వేలు దాటింది. మరణాల సంఖ్య 24090 మందికి చేరింది. ఇక అమెరికాలో ఒక్కోరోజే 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న చైనా, ఇటలీలను దాటేసింది. ప్రపంచంలోనే 85,594 కరోనా పాజిటివ్ కేసులతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత చైనా 81,340, ఇటలీ 80,589, స్పెయిన్ 57786 పాజిటివ్ కేసులతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.
ఇక మరణాల్లో ప్రపంచ వ్యాప్తంగా 8215 మంది మరణాలతో ఇటలీ అగ్రస్థానంలో ఉండగా..తర్వాతి స్థానాల్లో 4365 మరణాలతో స్పెయిన్ , 3292 మరణాలతో చైనా,2234 మరణాలతో ఇరాన్ , 1696 మరణాలతో ఫ్రాన్స్ , 1300 మరణాలతో అమెరికా ఉన్నాయి. ఇక భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 724 గా నమోదయ్యాయి. వీటిలో 66 మంది కోలుకున్నారు. 17 మంది చనిపోయారు.