యూఎస్ వీసా కోసం అప్లయ్ చేశారా.. సంవత్సరం వేచి ఉండాల్సిందే

యూఎస్ వీసా కోసం అప్లయ్ చేశారా.. సంవత్సరం వేచి ఉండాల్సిందే

యూఎస్ వీసా కోసం అప్లయ్ చేశారా..హైదరాబాద్ కాన్సులేట్ లో యూఎస్ వీసా అపాయింట్ మెంట్ ఇప్పట్లో దొరికేలా లేదు. వీసా అపాయింట్ మెంట్ కోసం సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు పాస్ పోర్టు అథారిటీ.న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం, వివిధ నగరాల్లోని కాన్సులేట్ లు వీసాలను త్వరగా జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తు్న్నప్పటికీ ఇంకా కొంత టైం పడుతుందంటున్నారు. 

హైదరాబాద్ కాన్సులేట్ వద్ద వీసారా కోసం వేచి ఉండే సమయం 351 రోజులు వరకు ఉంటుందని.. సుదీర్ఘ నిరీక్షణ తాత్కాలిక ఉద్యోగులకు, ఇంటర్వ్యూ మినహాయింపు సందర్శకుల వీసాలకు కూడా వర్తిస్తుందని పాస్ పోర్ట్ అథారిటీ చెపుతున్నారు.  

వీసా రకం,అపాయింట్ మెంట్ కోసం వెయిటింగ్ టైం                          

  • ఇంటర్వ్యూ అవసరం పిటిషన్ ఆధారిత తాత్కాలిక కార్మికులు( H, L, O, P, Q) - 53 రోజుల సమయం 
  • ఇంటర్వ్యూ అవసరమైన విజిటర్స్ (B1/B2) - 351 రోజులు 
  • ఇంటర్వ్యూ మినహాయింపు విజిటర్స్ (B1/B2) -50 రోజులు  

అయితే ఇటీవల భారత్ లోని యునైటెడ్ స్టేట్స్ రాయబారి ఎరిక్ గార్సెట్టి మొదటి సారి టూరిస్ట్ వీసా ఇంటర్వ్యూల కోసం అపాయింట్ మెంట్ వెయిట్ టైమ్ ను 50 శాతానికి పైగా తగ్గించబడుతుందని చెప్పారు. 

హైదరాబాద్, దేశంలోని వివిధ నగరాల్లోని కాన్సులేట్ లు అయితే 2023 వేసవిలో 90 వేల స్టూడెంట్ వీసాలను జారీ చేసి రికార్డు సృష్టించాయి. ప్రపంచ వ్యా్ప్తంగా జారీ చేయబడిన ప్రతి నాలుగు స్టూడెంట్స్ వీసాల్లో భారత్ నుంచి ఒకటి మంజూరు చేయబడింది.