భువనేశ్వర్: ఇండియా తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న ఫిఫా విమెన్స్ అండర్17 వరల్డ్‌కప్‌లో తమ ప్రయాణాన్ని మన అమ్మాయిలు ఓటమితో ఆరంభించారు. మెగా టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో ఇండియా 0–8 తేడాతో బలమైన అమెరికా చేతిలో పరాజయం పాలైంది. పెద్ద జట్లతో ఆడిన అనుభవం లేని అతిథ్య జట్టు.. ప్రత్యర్థికి ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మరోవైపు దూకుడుగా ఆడిన అమెరికా.. ఫస్టాఫ్‌లోనే ఐదు గోల్స్ రాబట్టింది.
సెకండాఫ్ లో ఇండియా డిఫెన్స్ కాస్త మెరుగైనా మరో మూడు గోల్స్‌తో యూఎస్ఏ ఘన విజయం సొంతం చేసుకుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ బ్రెజిల్ 1–0తో అరంగేట్ర జట్టు మొరాకోను ఓడించింది. అంతకుముందు కళింగ స్టేడియంలో టోర్నీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ టోర్నీని ప్రారంభించారు.
