పాత చీర అని తీసిపడేయకండి.. వాటితో ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

పాత చీర అని తీసిపడేయకండి.. వాటితో ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

ఇంట్లో పాత చీరలు ఉంటే స్టీల్ సామా న్లకు వేయడమో, బయట పారేయడ మో చేస్తుంటారు. చీర కొత్తదయితే.. చిల్లు పడడమో, అంచు చిరగడమో. జరిగితే ఎవరికీ ఇవ్వాలనిపించదు. పాడేయాలనిపించదు. అలాంటప్పుడు వాటిని సరిగా ఉపయోగించుకుంటే ఎన్నో విధాలుగా మార్చుకోవచ్చు. ఇంటిని డెకరేట్ చేయడానికో, పిల్లో కవర్లుగానో వాడుకోవచ్చు. పాత చీరల్లో కలర్ఫుల్ గా ఉన్నవాటిని డోర్, కిటీకీ కర్టెన్లుగా కడితే అందంగా కనిపిస్తాయి. 

ఇంటికి కొత్త ట్రెడిషనల్ లుక్ వస్తుంది. పాత సిల్క్ చీరలను కుషన్ కవర్లుగా మార్చుకోవచ్చు. కాకపోతే ఇందుకోసం కాస్త బ్రైట్గా ఉండే రంగుల చీరలనే ఉపయోగిం చుకోవాలి. ఒకే కలర్లో ఉండే కాటన్ చీరలతో పిల్లో కుషన్లు కుట్టించుకుంటే అందంగా కనిపిస్తాయి. జరీ చీరలను టేబుల్ క్లాత్గా వాడుకోవచ్చు. ప్లెయిన్ క్లాత్ కి జరీ చీరల ముక్కలను జత చేస్తే సూపర్ లుక్ వస్తుంది. 

పాత చీరల్లో మంచి డిజైన్ ఉన్న భాగాన్ని కట్ చేసి ఫ్రేమ్ చేయించి గోడలకు పెట్టుకుంటే హాల్ అందాన్ని రెట్టింపు చేస్తాయి. అంతే కాదు గ్రామీణ ప్రాంతాల్లో పాత చీరలను పొలాల్లోకి అడవి జంతువులు రాకుండా ఉండేందుకు కడతారు. ఎలా చూసినా.. పాత చీరలతో బోలెడు ఉపయోగాలున్నాయి. అందుకే వాటిని పాడేయకుండా పైన చెప్పినట్లు ఉపయోగించుకుంటే బెటర్.