ప్లాస్టిక్ వాడకం పెను ముప్పు : వెంకటేశ్వరాచారి

ప్లాస్టిక్ వాడకం పెను ముప్పు : వెంకటేశ్వరాచారి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్లాస్టిక్​ వినియోగంతో భవిష్యత్​ తరాలకు పెను ముప్పు ఏర్పడనుందని డీఈఓ వెంకటేశ్వరాచారి హెచ్చరించారు.  ప్లాస్టిక్​ వినియోగంతో కలిగే నష్టాలపై స్టూడెంట్స్​కు స్టేట్​ నేషనల్​ గ్రీన్​ కోర్స్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏకపాత్రాభినయం, నాటికల పోటీలను ఇటీవల నిర్వహించారు.

కొత్తగూడెంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన ప్రోగ్రాంలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్​యూజ్​ప్లాస్టిక్​ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్​ వాడకాన్ని ఎవరికి వారు స్వచ్ఛందంగా మానుకోవాలని  సూచించారు. ప్రోగ్రాంలో జిల్లా సైన్స్​ ఆఫీసర్​ చలపతి రాజు, స్టేట్​నేషనల్ ​గ్రీన్​ కోర్స్​ ప్రాజెక్ట్​ఆఫీసర్ ​టీ.రాధిక పాల్గొన్నారు.