ఉపయోగపడే డైలీ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గూగుల్ ఫీచర్లు

ఉపయోగపడే డైలీ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గూగుల్ ఫీచర్లు

గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సరిగ్గా వాడుకోవడం తెలిస్తే రోజువారీ పనులను చాలా సింపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చుకోవచ్చు. ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్, గూగుల్ సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండే కొన్ని ఫీచర్లు డైలీ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని చాలా సందర్భాల్లో ఉపయోగపడతాయి. 

ఎక్కడికైనా వెళ్లినప్పుడు పార్కింగ్ దొరక్క ఇబ్బంది పడుతుంటారు చాలామంది. అయితే గూగుల్ మ్యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా దగ్గర్లోని పార్కింగ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కనిపెట్టొచ్చు. డెస్టినేషన్ ఎంటర్ చేసి, డైరెక్షన్స్ నొక్కిన తర్వాత కింద కనిపించే ఆప్షన్లలో ‘పార్కింగ్ లాట్స్’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే దగ్గర్లోని పార్కింగ్ ప్లేస్ చూపిస్తుంది. అలాగే మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జూమ్ చేసి ‘P’ అనే లెటర్ కోసం వెతికినా.. పార్కింగ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కనిపెట్టొచ్చు.  గూగుల్ సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండే మరో అద్భుతమైన ఫీచర్.. ‘మల్టీ సెర్చ్’. కంటికి కనిపించే వస్తువులతో చేసే సెర్చ్ ఇది. ఉదాహరణకు ఎదురుగా ఒక సోఫా సెట్ ఉంది. దాని డిజైన్, పేరు తెలీదు. కానీ, అలాంటిది మీకూ ఒకటి కావాలి. అప్పుడు దాన్ని గూగుల్ లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో క్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనిపించి మల్టీ సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మీకుండే ప్రశ్నలు సెర్చ్ బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టైప్ చేయాలి. ‘టేబుల్’ అని టైప్ చేస్తే ఆ సోఫా సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూట్ అయ్యే టీపాయ్​ టేబుల్ వివరాలు చూపిస్తుంది. 
గూగుల్ త్వరలో మరో కొత్త ఫీచర్ తీసుకురానుంది. అదే  మ్యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘లైవ్ వ్యూ ఏఆర్’. ఏదైనా కొత్త ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లినప్పుడు అక్కడ రకరకాల షాపులు, బిల్డింగులు కనిపిస్తాయి. కానీ, వాటి వివరాలేవీ మనకు తెలియదు. అప్పుడు మ్యాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కెమెరా బటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లిక్ చేసి ఎదురుగా కనిపిస్తున్న షాపుపై ఫోకస్ చేస్తే చాలు.. దాని వివరాలన్నీ స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కనబడతాయి. ఆ షాపులో దొరికే వస్తువులు, షాపు టైమింగ్స్ వంటివి తెలిసిపోతాయి. ప్రస్తుతం యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలో మన దగ్గర కూడా వస్తుంది.