Cricket World Cup 2023: ఆల్‌టైం గ్రేట్ సచిన్ కాదు.. విరాట్ కోహ్లీ: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్

Cricket World Cup 2023: ఆల్‌టైం గ్రేట్ సచిన్ కాదు.. విరాట్ కోహ్లీ: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్

ఇండియన్ క్రికెట్ లో ఆల్ టైం గ్రేట్ ఎవరంటే అందరూ ఠక్కున క్రికెట్ గాడ్ సచిన్ పేరు చెబుతారు. కెరీర్ లో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న సచిన్ అంతకు మించిన ఖ్యాతిని అందుకున్నాడు. ఎన్ని సంవత్సారాలు క్రికెట్ ఆడినా సచిన్ రికార్డ్స్ కొన్ని  బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇప్పటికే క్రికెట్ లో ఆల్ టైం గ్రేట్ సచిన్ టెండూల్కర్ అనే విషయం చాలా మంది చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఆస్ట్రేలియన్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా మాత్రం విరాట్ కోహ్లీని ఆల్ టైం గ్రేట్ అనే ట్యాగ్ ఇచ్చాడు. 

Also Read : Cricket World Cup 2023: వికెట్లు తీయడు.. పరుగులు చేయలేడు: జట్టుకు భారమవుతున్న ఆల్‌రౌండర్

  
"విరాట్ కోహ్లీ సచిన్ కంటే చాలా తక్కువ మ్యాచులాడాడు. కానీ కోహ్లీ మాత్రం సచిన్ రికార్డులకు చాలా దగ్గరకు వచ్చాడు. నా ఉద్దేశ్యంలో వన్డేల్లో విరాట్ కోహ్లీ ఆల్ టైం బెస్ట్ వన్డే బ్యాటర్. ఈ విషయం అతని గణాంకాలు చూస్తే అర్ధమవుతుంది. నా చిన్నప్పుడు సచిన్ ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసాడు. దానికి విరాట్ తప్ప ఎవరు అందుకోలేకపోయారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా తనకంటూ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నాడు. వన్డేల్లో గ్రేటర్ రన్ ఛేజర్. అతని నిలకడైన ప్రదర్శన చూస్తే ముచ్ఛటేస్తుంది. ఇంత సుదీర్ఘకాలం నిలకడైన ప్రదర్శన ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇది తరానికి ఒక్కరికే సాధ్యం అవుతుంది".  అని ఖవాజా చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా.. టీమిండియా ప్రస్తుత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సచిన్ రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. అయితే కోహ్లీ వన్డేల్లో మాత్రమే సచిన్ కి సమీపంలో ఉన్నా.. టెస్టుల్లో మాత్రం చాలా దూరంగానే ఉన్నాడు. వన్డే ఫార్మాట్ చూసుకుంటే విరాట్ గణాంకాలు అత్యద్బుతమనే చెప్పాలి. ఇంకా 300 వన్డేలు కూడా ఆడకుండానే 47 సెంచరీలు, 13 వేలకు పైగా పరుగులు చేసాడు.

ఒకరకంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఆల్ టైం బెస్ట్ వన్డే బ్యాటర్ గా పరిగణించవచ్చు. రెండు విభిన్న తరాల్లో ఆడిన ఇద్దరు ఇద్దరు దిగ్గజాలను పోల్చడం సరైంది కాకపోయినా ఖవాజా ఓట్ మాత్రం విరాట్ కే వేసాడు. క్రికెట్ లో వన్డేల్లో విరాట్ ఆల్ టైం గ్రేట్ గా చెప్పుకొస్తున్నా.. క్రికెట్ లో మాత్రం సచినే ఆల్ టైం గ్రేట్ అని ఒప్పుకోవాల్సిందే.