ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని యూఎస్పీసీ స్టేట్ ​లీడర్​ వై. అశోక్ కుమార్, లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు సామూహిక నిరాహార దీక్షకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, జీవో 317 అమలు కారణంగా ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

స్వయంగా సీఎం కేసీఆర్​బదిలీలు పదోన్నతులు చేపడతామని ప్రకటించినా ఇప్పటికీ అతీగతి లేదన్నారు. హైస్కూల్స్​లో వేలాది సబ్జెక్ట్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రైమరీ స్కూళ్లలో సరిపడా ఉపాధ్యాయులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాంచందర్ , లక్ష్మయ్య యాదవ్ సంజీవయ్య ,విజయభాస్కర్ పాల్గొన్నారు.