పవన్ ఎక్కడుంటే షూటింగ్ అక్కడే.. సరికొత్తగా సెట్ చేసిన మేకర్స్

పవన్ ఎక్కడుంటే షూటింగ్ అక్కడే.. సరికొత్తగా సెట్ చేసిన మేకర్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Powerstar pawan kalyan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagathsingh). స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. మైత్రి మూవీ మేకర్స్(Mytri movie makers) నిర్మిస్తున్న. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ వైజాగ్ లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం పవన్ వారాహి విజయ యాత్రలో ఫుల్ బిజీగా ఉన్నాడు. 

అందుకే పవన్ ఎక్కడ ఉంటే అక్కడ షూటింగ్ సెట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కొత్త షెడ్యూల్ ను వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరగనుంది. 

ఇక ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు.. హీరోయిన్ శ్రీలీల(Sreeleela) కూడా పాల్గొననుంది. సినిమాలో పలు కీలక సన్నివేశాలను పవన్, శ్రీలీలపై తెరకెక్కించనున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. పూజ హెగ్డే(Pooja Hegde) మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi sri prasad) సంగీతం అందిస్తున్నాడు. 2023 చివర్లో గానీ, 2024 సమ్మర్ లో గానే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.