పార్తిబన్‌‌ స్పెషల్ గిఫ్ట్‌‌

పార్తిబన్‌‌ స్పెషల్ గిఫ్ట్‌‌

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌‌ సంస్థ  నిర్మిస్తోంది.  ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు పార్తిబన్‌‌ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌‌ చివరి రోజున పార్తిబన్‌‌.. ఓ స్పెషల్‌‌ మెమొంటోను  దర్శకుడు హరీష్‌‌ శంకర్‌‌‌‌కు బహుకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను మేకర్స్‌‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేవారు. ఇందులో పార్తిబన్‌‌ ఇచ్చిన గిఫ్ట్‌‌ బాక్స్‌‌ను తెరుస్తూ కనిపించిన హరీష్.. ‘‘మీలాంటి గొప్ప నటుడు, రచయిత, దర్శకుడుతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం. షూటింగ్‌‌లో మీరెంతగానో సపోర్ట్ చేశారు.  ఈ చిత్రంలోని మీ నటనను ప్రేక్షకులు ఖచ్చితంగా ఇష్టపడతారు” అని చెప్పారు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అయనాంక బోస్ సినిమాటోగ్రాఫర్‌‌గా పనిచేస్తున్నారు.