పాము కాటుతో భార్యను చంపిన భర్తకు రెండు జీవిత కాలాల శిక్ష

పాము కాటుతో భార్యను చంపిన భర్తకు రెండు జీవిత కాలాల శిక్ష

బెల్గాం: కేరళలో పాము కాటుతో భార్యను చంపిన సూరజ్ అనే వ్యక్తికి కోర్టు రెండు జీవిత కాలాల శిక్ష విధించింది. గతేడాది మేలో జరిగిన ఈ ఘటనపై కొల్లాం జిల్లా అడిషనల్ సెషన్స్ కోర్టులో విచారణ పూర్తయింది. సూరజ్‌ను ఇప్పటికే దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి రెండు జీవిత కాలాల శిక్షను విధించింది. ఆధారాలను మాయం చేసినందుకు, విష ప్రయోగం చేసినందుకు గానూ న్యాయస్థానం సూరజ్‌కు పదేళ్ల 7 నెలల పాటు మరో శిక్షను కూడా వేసింది. 

ఆస్తిపై కన్నేసి.. పాముతో కాటేయించాడు

భార్య ఉత్తర ఆస్తిపై కన్నేసిన సూరజ్.. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉత్తర ఆస్తిని కాజేసి, మరో మహిళను పెళ్లి చేసుకుందామని స్కెచ్ వేశాడు. అయితే ఆమెను చంపినా దొరక్కుండా ఉండేందుకు.. పాముతో చంపాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా గతేడాది ఫిబ్రవరిలో తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాడు. కానీ మే నెలలో చేసిన రెండో అటెంప్ట్‌లో సక్సెస్ అయ్యాడు. పాములను పట్టుకునే మిత్రుడు సురేష్ సాయంతో భార్యను తాచు పాముతో కాటు వేయించాడు. దాని విష ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఉత్తర దాదాపు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ ప్రాణాలు దక్కించుకోలేకపోయింది. ఆమె జూన్ మొదటి వారంలో ప్రాణాలు కోల్పోయింది. 

కూతురు ఉత్తర మృతి తర్వాత అల్లుడు సూరజ్ వ్యవహార శైలిపై అనుమానం రావడంతో ఆమె తల్లిదండ్రులు అతడిపై అనుమానంగా ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో క్రైమ్‌ బ్రాంచ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనంతరం సూరజ్ కుతంత్రం బయటపడింది. సూరజ్‌, సురేష్.. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఎట్టకేలకు దాదాపు ఏడాది తర్వాత సూరజ్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 

మరిన్ని వార్తలు: 

కబడ్డీ ఆడుతున్న బాలికను ఎత్తుకెళ్లి చంపేశారు

సావర్కర్‌ను జాతిపిత చేస్తారేమో?: అసదుద్దీన్ ఒవైసీ

పాక్‌కు వెళ్లిన ముస్లింలకు గౌరవం దక్కట్లే: మోహన్ భగవత్