స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన ఉత్పల్ పారికర్

స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమైన ఉత్పల్ పారికర్

పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. గతంలో తండ్రి పోటీ చేసిన పనాజీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్లు ఉత్పల్ ప్రకటించారు. గురువారం నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైన ఆయన తన రాజకీయ భవిష్యత్తును పనాజీ ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. 

బీజేపీ ఈసారి ఎన్నికల్లో పనాజీ టికెట్ ను తనకే ఇస్తుందని భావించిన ఉత్పల్ అందుకు సన్నాహాలు కూడా ప్రారంభించారు. కానీ ఆయనకు టికెట్ నిరాకరించిన ఆ పార్టీ మనోహర్ పారికర్ చిరకాల ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో మాన్సెరెట్టేకు టికెట్ ఇచ్చింది. మనోహర్ పారికర్ మరణం తర్వాత పనాజీ ఉప ఎన్నికల్లో పోటీకి ఉత్పల్ సిద్ధమైనా బీజేపీ మాత్రం ఆయనను బరిలో నిలపలేదు. పారికర్ అనుయాయుడైన సిద్ధార్థ్ కున్ కోయిలైకర్ ను పోటీలో నిలపగా.. బీజేపీ ఓటమి పాలైంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన అటానాసియో అనంతరం బీజేపీలో చేరారు.

For more news..

కాంగ్రెస్ నేతలతో కూడిన కాషాయ పార్టీ బీజేపీ

రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ