50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఉత్తమ్

50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఉత్తమ్

హుజూర్ నగర్ లో 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(అక్టోబర్ 24)  సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం వెళ్లిన ఉత్తమ్ కుమార్ కు కాంగ్రెస్ కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఉత్తమ్.. వేపల సింగారంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హుజూర్ నగర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కేటీఆర్, కవిత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు సరికాదని...మీది ఆస్థాయి కాదని ఉత్తమ్ మండిపడ్డారు. ఇప్పుడు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మొదటి మెట్టు అని అన్నారు.  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు.

Also Read :- బాలయ్య బాక్సాఫీస్ దండయాత్ర 

రాజకీయంగా నష్టపోతున్నా అని తెలిసినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని అన్నారు.
 కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మంచి పదవిలో కొనసాగుతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని తెలిపారు.