TPCC చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా

TPCC చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా

హైదరాబాద్: GHMC ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో పార్టీ ఓటమికి పైతిక బాధ్యత వహిస్తూ TPCC చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 2 చోట్ల మాత్రమే గెలుపొందింది. ఉప్పల్, ఏఎస్‌రావునగర్‌లో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులో ఎవరినో ఒకరిని డిసెంబర్ 9న పీసీసీ చీఫ్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.