ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

 ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు కాబోతుందంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో  బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. తాను కోదాడ నుంచి 50 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీలో ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో 25 శాతం ఓటింగ్ లీడ్‭లో ఉన్నామని చెప్పారు.  రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర  ప్రపంచ చరిత్రలో అరుదైన సంఘటన అని ఉత్తమ్ కొనియాడారు. రాహుల్‭తో కలిసి తాను ఏపీ, తెలంగాణలో 450 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని చెప్పారు.