వావ్..మహిళా కానిస్టేబుల్..బాడీ బిల్డింగ్లో మెడల్..హ్యాట్సాఫ్ మేడమ్

వావ్..మహిళా కానిస్టేబుల్..బాడీ బిల్డింగ్లో మెడల్..హ్యాట్సాఫ్ మేడమ్

మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారనడానికి ఆమె ఒక ఉదాహరణ.మహిళలు ఏదైనా సాధించగలరు అని నిరూపించారు ఈ మహిళా కానిస్టేబుల్. మహిళలు ఉద్యోగాల్లో రాణించాలంటేనే కష్టమైన ప్రస్తుత పరిస్థితుల్లో చేసేది కష్టతరమైన ఉద్యోగం చేస్తూనే..బాడీ బిల్డర్గా ఏకంగా జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంటోంది ఈమె.. అటు ప్రజలనుంచి, డిపార్ట్ మెంట్ నుంచి ప్రశంసలందుకుంటోంది. ఉత్తరాఖండ్ లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పూజా భట్ బాడీ బిల్డింగ్  లో రాణిస్తోంది. ఇటీవల గోవాలోని వాస్కోలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో పతకం సాధించిన పూజాభట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 

ఉత్తరాఖండ్ పోలీసులు X (గతంలో ట్విట్టర్) లో  పోలీసులు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ చేశారు.అందులో  హరిద్వార్ లోని ఖాన్ పూర్ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పూజాభట్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. గోవాలో జరిగిన ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ పోటీలో కాంస్య పతకాన్ని పూజా భట్ గెలుచుకోవడం ఉత్తర ఖండ్ పోలీసులకు గర్వకారణం అంటూ పోస్ట్ చేశారు. మొత్తం ఉత్తరాఖండ్ పోలీస్ కుటుంబం తరపున ఆమెకు అభినందనలు అంటూ రాశారు. 

మహిళా కానిస్టేబుల్ పూజాభట్ ఉత్తరాఖండ్ లోని పౌరి జిల్లా వాసి. ఆమె బాడీ బిల్డింగ్ లో మిస్ రిషికేష్..హల్ద్వానీలో జరిగిన ఛాంపియన్ షిప్ విజేత కూడా.కానిస్టేబుల్ పూజా భట్ దేశంలోనే ఉత్తర ఖండ్ పోలీసులకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారని హరిద్వార్ ఎస్ ఎస్పీ ప్రమేంద్ర దోబల్ మెచ్చుకున్నారు.

వచ్చేసారి బంగారం పతకం సాధిస్తా: పూజాభట్ 

ఈసారి కాంస్యపతకం తీసుకొచ్చాను.. వచ్చేసారి బంగారు పతకం లక్ష్యంగా కృషి చేస్తానని బాడీ బిల్డర్ కమ్ లేడీ కానిస్టేబుల్ పూజా భట్ అన్నారు. పూజాభట్ కు ఉత్తరాఖండ్ పోలీసులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఎస్ ఎస్పీ ప్రమేంద్ర దోబల్ చెప్పారు.