
హైదరాబాద్, వెలగు: హోం అప్లయన్సెస్ తయారీ సంస్థ వీగార్డ్ "లక్స్‌క్యూబ్" సిరీస్ వాటర్ హీటర్లను విడుదల చేసినట్లు ప్రకటించింది. స్టైలిష్ డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో రూపొందిన ఈ వాటర్ హీటర్లు కేవలం నీటిని వేడి చేయడమే కాకుండా, ఇంటి సౌందర్యాన్ని పెంచే విధంగా సొగసైన, కాంపాక్ట్ డిజైన్‌తో వస్తాయని పేర్కొంది.
ఈ సిరీస్‌లోని వాటర్ హీటర్లు కరెంటును తక్కువగా వాడుకుంటాయని తెలిపింది. ఈ నూతన సిరీస్ ప్రొడక్టుల్లో పలు స్మార్ట్ ఫీచర్లతో పాటు, చైల్డ్లాక్వంటి సెక్యూరిటీ ఫీచర్లూ ఉన్నాయని వీగార్డ్ తెలిపింది.