నెల రోజుల్లో అందరికీ వ్యాక్సిన్

నెల రోజుల్లో అందరికీ వ్యాక్సిన్

    రోజుకు 6.6 లక్షల డోసుల టార్గెట్
    ఊరూరికీ వ్యాక్సిన్​ సెంటర్ల ఏర్పాటు
    యాక్షన్​ ప్లాన్​ రెడీచేసిన హెల్త్ ​ఆఫీసర్లు
    ప్రభుత్వానికి రిపోర్టు​ అందజేత


రాష్ర్టంలో కరోనా వ్యాక్సినేషన్‌‌ను నెల రోజుల్లో కంప్లీట్ చేయాలని రాష్ర్ట సర్కార్ భావిస్తోంది. ఇందుకు హెల్త్ ఆఫీసర్లు యాక్షన్‌‌ ప్లాన్‌‌ రెడీ చేశారు. ప్రతి ఊర్లో వ్యాక్సినేషన్‌‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రోజుకు 6,66,667 మంది చొప్పున, 30 రోజుల్లోనే 18 నుంచి 45 ఏండ్ల మధ్య వయసున్న వారందరికీ వ్యాక్సిన్ వేయొచ్చని ప్రభుత్వానికి రిపోర్ట్​ అందించారు. రాష్ర్టంలో 18 నుంచి 45 ఏండ్ల మధ్య వయసున్న వారు1,72,41,110 మంది ఉన్నారు. వేస్టేజ్‌‌తో కలిపి వీరికి 2 డోసుల చొప్పున వ్యాక్సిన్​ వేయడానికి, 4 కోట్ల వ్యాక్సిన్ డోసులు కోనుగోలు చేయాల్సి ఉంటుందని రిపోర్టులో పేర్కొన్నారు. రాష్ర్టంలో పది వేల మంది వ్యాక్సినేటర్లు అందుబాటులో ఉన్నారని, అవసరమైతే ప్రైవేట్ నుంచి మరింత మందిని తీసుకోవచ్చని తెలిపారు. ఒక్కో వ్యాక్సినేటర్ రోజుకు 150 మందికి వ్యాక్సిన్ వేయొచ్చన్నారు. ప్రస్తుతం 45 ప్లస్ ఏజ్ వాళ్లకు 1,468 సెంటర్లలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 45 కంటే తక్కువ ఉన్నోళ్ల కోసం మరో 4 వేల సెంటర్లు ఏర్పాటు చేయాలని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ అడ్వైజ్ చేసింది. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లు, స్కూళ్లు, కాలేజీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, హౌజింగ్ సొసైటీలను వాడుకోవచ్చని పేర్కొంది. వ్యాక్సిన్ రిజిస్ర్టేషన్‌‌, ఇతర ప్రాసెస్‌‌ కోసం ఓ యాప్‌‌ను కూడా రెడీ చేయాలని నిర్ణయించారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ప్రైవేట్‌‌లో, ఇద్దరు ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సిన్ వేసుకుంటారని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ అంచనా వేసింది. దీని కోసం ప్రభుత్వమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి ప్రైవేట్‌‌కు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ర్టంలో 45 ఏండ్లు దాటిన వాళ్లు, హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌‌లైన్ వర్కర్లు కలిపి 99,76,555 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటివరకూ 6,01,631 మంది రెండు, 40,07,044 మంది ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు.