రాష్ట్రంలో నత్తనడకన వ్యాక్సినేషన్

రాష్ట్రంలో నత్తనడకన వ్యాక్సినేషన్
  • వారంలో 18 లక్షల మందికే టీకా
  • వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్​లో తెలంగాణ వెనకబడింది. గతంతో పోల్చితే తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రోజువారీ టీకాలు తక్కువ సంఖ్యలో నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నేషన్ అప్​డేట్​ను కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం రిలీజ్ చేసింది. గడిచిన వారం రోజుల్లో మన రాష్ట్రంలో 18 లక్షల మందికి మాత్రమే టీకాలు వేసినట్లు తెలిపింది. ఇదే టైంలో ఉత్తరప్రదేశ్ 56 లక్షల టీకా డోసుల వేసి దేశంలోనే వేగంగా టీకాలిస్తున్న రాష్ట్రాల్లో టాప్ ప్లేస్​లో నిలిచింది. 44 లక్షల వ్యాక్సిన్ డోసులతో వెస్ట్ బెంగాల్  తర్వాతి స్థానంలో ఉంది. ఏపీలో 28 లక్షలు, మహారాష్ట్రలో 25 లక్షల వ్యాక్సిన్ డోసులు వేశారు. కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఫస్ట్, సెకండ్ డోసులు కలిపి 56.91 లక్షల టీకాలు వేయగా.. ఇప్పటివరకు మొత్తం డోసుల సంఖ్య105.43 కోట్లకు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు వరకు రాష్ట్రాలు, యూటీలకు ఉచితంగా 111.13 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. మరో 12.73 కోట్ల డోసులు స్టేట్స్, యూటీల వద్ద స్టాక్ ఉన్నట్లు తెలిపింది.