టీకాల టెండర్లు.. ముందుకు రాని వ్యాక్సిన్​ కంపెనీలు 

టీకాల టెండర్లు.. ముందుకు రాని వ్యాక్సిన్​ కంపెనీలు 

ముందుకు రాని వ్యాక్సిన్​ కంపెనీలు 
కరోనా టీకాల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన గ్లోబల్ టెండర్లకు ఆదరణ కరువైంది. ఒక్క సంస్థ కూడా టెండర్‌‌లో పాల్గొనలేదు. గత నెల 26న నిర్వహించిన ప్రీ-బిడ్‌ మీటింగ్‌లో పాల్గొన్న స్పుత్నిక్ వీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలు కూడా చివరకు టెండర్‌ వేయలేదు. మొత్తం కోటి డోసుల కొనుగోలుకు గత నెల 19న ప్రభుత్వం టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనా టీకాల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన గ్లోబల్ టెండర్లకు ఆదరణ కరువైంది. ఒక్క సంస్థ కూడా టెండర్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనలేదు. గత నెల 26న నిర్వహించిన ప్రీ-బిడ్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో పాల్గొన్న స్పుత్నిక్ వీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలు కూడా చివరకు టెండర్‌‌‌‌ వేయలేదు. మొత్తం కోటి డోసుల కొనుగోలుకు గత నెల 19న ప్రభుత్వం టెండర్లు పిలిచింది. శుక్రవారం వరకు టెండర్ వేసేందుకు గడువు ఇచ్చింది. సాయంత్రం ఆరున్నరకు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్‌‌‌‌(టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీ) ఆఫీసర్లు ఆన్‌‌‌‌లైన్ టెండర్లను ఓపెన్ చేశారు. అయితే అందులో ఒక్క బిడ్‌‌‌‌ కూడా లేకపోవడంతో.. ఒక్క కంపెనీ కూడా టెండర్​వేయలేదని ఆఫీసర్లు ప్రకటించారు. 
ముందే తెలిసినా... 
తెలంగాణ కంటే ముందే 11 రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి. అందరికంటే ముందు బృహన్ ముంబై కార్పొరేషన్ కోటి డోసులకు గ్లోబల్ టెండర్లు పిలిచింది. ఇందులో మధ్యవర్తులే తప్ప వ్యాక్సిన్ తయారీ కంపెనీలేవీ టెండర్లు వేయలేదు. అన్ని రాష్ట్రాలది ఇదే పరిస్థితి. ఇవన్నీ తెలిసినా మన సర్కార్ గ్లోబల్ టెండర్లు అంటూ ప్రజలను మభ్యపెట్టింది. వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మంతనాలు జరుపుతున్నారని ఊదరగొట్టింది. కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్లతో 18 నుంచి 44 ఏండ్ల వాళ్లకు అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రారంభించినా, మన రాష్ట్రంలో మాత్రం చేయలేదు. గ్లోబల్ టెండర్లతో వ్యాక్సిన్లు వస్తాయని, ఆ తర్వాత 18 నుంచి 44 ఏండ్ల వాళ్లకు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని హెల్త్ ఆఫీసర్లు పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడిక కేంద్రమిచ్చే డోసులతో వేయక తప్పని పరిస్థితి నెలకొంది. 
డిమాండ్ ఎక్కువుండడంతోనే..  
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో టెండర్లలో పాల్గొని, ప్రభుత్వాలు పెట్టే నిబంధనలకు లోబడి వ్యాక్సిన్ల పంపిణీకి కంపెనీలు సిద్ధంగా లేవు. తాము పెట్టే రూల్స్‌‌‌‌కు ఒప్పుకుంటేనే వ్యాక్సిన్లు సప్లై చేస్తామని ఇప్పటికే పలు కంపెనీలు ప్రకటించాయి. రాష్ట్ర సర్కార్లతో కాకుండా కేంద్ర సర్కార్‌‌‌‌‌‌‌‌తో మాత్రమే డీల్ చేస్తామని స్పష్టం చేస్తాయి. ప్రస్తుతం డబ్ల్యూహెచ్ ఓ, డీసీజీఐ, ఎఫ్‌‌‌‌డీఐ పర్మిషన్ ఉన్న వ్యాక్సిన్లు ఏడు ఉన్నాయి. ఇందులో భారత్ బయోటెక్ కొవాగ్జిన్, కొవిషీల్డ్‌‌‌‌(ఆస్ట్రాజెనెకా), స్పుత్నిక్‌‌‌‌ వీ వ్యాక్సిన్లు మన దేశంలో అందుబాటులోకి వచ్చాయి. కొవాగ్జిన్, కొవిషీల్డ్ ఉత్పత్తిలో ఆయా కంపెనీలు సగం కేంద్రానికి ఇచ్చి, ఇంకో సగం తమకు నచ్చినోళ్లకు అమ్ముకుంటున్నాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్‌‌‌‌ వీతో హైదరాబాద్‌‌‌‌లోని రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందం చేసుకుంది. మన దేశంలో వ్యాక్సిన్లకు ఉన్న డిమాండ్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని ఆ సంస్థ కూడా టెండర్లలో పాల్గొనడం లేదు. ఫైజర్‌‌‌‌‌‌‌‌, మోడెర్నా, జాన్సన్‌‌‌‌ అండ్ జాన్సన్‌‌‌‌ వంటి అమెరికన్ కంపెనీలు కేంద్రంతో మాత్రమే డీల్ చేస్తామని ప్రకటించాయి. చైనాకు చెందిన సినోఫార్మ్‌‌‌‌ వ్యాక్సిన్లకు డబ్ల్యూహెచ్ ఓ పర్మిషన్ ఉంది. కానీ, దీని విషయంలో స్పష్టత లేదు.