ప్రజలందరికీ ఫ్రీగా వ్యాక్సిన్.. పుదుచ్చేరి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీలు 

ప్రజలందరికీ ఫ్రీగా వ్యాక్సిన్.. పుదుచ్చేరి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీలు 

పుదుచ్చేరి ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నీట్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలను రద్దు చేస్తామని తెలిపింది. గృహిణులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సాయం అందజేస్తామని చెప్పింది. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించేందుకు కృషి చేస్తామని, కేంద్రం నుంచి రాష్ట్రం తీసుకున్న రుణాల మాఫీ కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు పుదుచ్చేరి ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీరప్ప మొయిలీ ఆదివారం విడుదల చేశారు. మొదటి కాపీని మాజీ సీఎం వి.నారాయణ సామికి అందజేశారు.