Vaibhav Sooryavanshi: పసికూన ఐర్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత క్రికెట్ జట్టు.. ఇప్పుడు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లోని డర్హామ్‌లో ల్యాండ్ అయింది. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం (Debut) కోసం వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు టీమ్ మేనేజ్మెంట్ గట్టి షాకే ఇచ్చింది. రేపటి నుంచి (జూలై 1) ప్రారంభం కానున్న మొదటి టీ20 మ్యాచ్‌లో కూడా వైభవ్ బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తుంది.
శాంసన్‌ను పక్కన పెట్టలేం:
ఐర్లాండ్ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ చాన్స్ దక్కించుకోలేకపోయిన వైభవ్‌ను ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో ఆడిస్తారని అందరూ భావించారు. కానీ, టీమిండియా అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డోస్చాట్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. వైభవ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడటానికి 100 శాతం రెడీగా ఉన్నాడు.. కానీ టీ20 వరల్డ్ కప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ వికెట్ కీపర్ ప్లేయర్ శాంసన్‌ను మేము పక్కన పెట్టలేమని డోస్చాట్ స్పష్టం చేశాడు.
అభిషేక్ శర్మ సేఫ్:
మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఐర్లాండ్ సిరీస్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. అందుకే అతడిని కూడా డ్రాప్ చేసే ఆలోచనలో టీమిండియా మేనేజ్మెంట్ లేదు.. ప్లేయర్లకు లాంగ్ రన్ ఇవ్వడమే తమ ప్లాన్ అని, కాబట్టి వైభవ్ తన చాన్స్ కోసం మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని అసిస్టెంట్ కోచ్ రియాన్ పేర్కొన్నాడు. కాగా చివరి నిమిషంలో ఎవరికైనా గాయాలైతే తప్ప వైభవ్ తొలి మ్యాచ్‌లో తుది జట్టులోకి రావడం కష్టమేనని తెలియడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇంగ్లాండ్ టూర్‌కు భారత స్క్వాడ్:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్.
IND vs ENG T20I సిరీస్ షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం):
* 1st T20I: జూలై 1 – రివర్సైడ్ గ్రౌండ్ (చాస్టర్-లీ-స్ట్రీట్) – రాత్రి 10:00 గంటలకు..
* 2nd T20I: జూలై 4 – ఓల్డ్ ట్రాఫోర్డ్ (మాంచెస్టర్) – రాత్రి 7:00 గంటలకు..
* 3rd T20I: జూలై 7 – ట్రెంట్ బ్రిడ్జ్ (నాటింగ్‌హామ్) – రాత్రి 10:00 గంటలకు..
* 4th T20I: జూలై 9 – కౌంటీ గ్రౌండ్ (బ్రిస్టల్) – రాత్రి 10:00 గంటలకు..
* 5th T20I: జూలై 11 – ది రోజ్ బౌల్ (సౌతాంప్టన్) – రాత్రి 7:00 గంటలకు..
