నేను రాముడిని కాదప్పా రావణుడు కొలిచే రుద్రకాళేశ్వరుడిని: ఆదికేశవ ట్రైలర్

నేను రాముడిని కాదప్పా రావణుడు కొలిచే రుద్రకాళేశ్వరుడిని: ఆదికేశవ ట్రైలర్

హీరో వైష్ణవ్‌ తేజ్‌(VaishnaviTej)..సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) జోడీగా నటిస్తున్న మూవీ ఆదికేశవ(Aadikeshava). లేటెస్ట్గా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ని రిలీజ్ చేశారు మేకర్స్.

వైష్ణవ తేజ్ పక్కా మాస్ అవతారంలో కనిపించి అదరగొట్టేశాడు. ట్రైలర్ స్టార్ట్ అవుతూ..ఏ పనీ పాటలేకపోయినా ఎంత స్టైల్‌గా ఉంటాడు మా వాడు..అంటూ హీరో ఇంట్రడక్షన్‌తో మొదలవ్వగా..లవ్‌ట్రాక్ మెస్మరైజింగ్గా ఉంది. అయ్యా బాలకోటయ్య..నిన్ను జాగ్రత్తగా చంటిపిల్లాడిలా ఎత్తుకుని తిరగాలేమో..ఎత్తుకోలేనుగా..తిప్పుకుంటాలే అంటూ శ్రీలీల చెప్పే బ్యూటిఫుల్ డైలాగ్స్ బాగున్నాయి.

ఆ తర్వాత విలన్ ఎంట్రీ ఇస్తూ..రాముడు లంక మీద పడింది వినుంటావ్‌..అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టా ఉంటదో నేను చూపిస్తా..విలన్ జోజు జార్జ్‌ డైలాగ్ ఇంటెన్స్గా ఉంది. నేను అయోధ్యలో ఉండే రాముడిని కాదప్పా..ఆ రావణుడు కొలిచే రుద్రకాళేశ్వరుడిని..అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పై డైలాగ్స్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రియల్ ఇన్సిడెంట్స్తో తెరకెక్కుతున్న ఈ మూవీ..వైష్ణవ్ తేజ్ ఖాతాలో సక్సెస్ను అందించేలా కనిపిస్తోంది. లవ్, యాక్షన్‌, కోలార్ మైనింగ్ కాన్సెప్ట్స్తో మూవీ వస్తుండటంతో వైష్ణవ్ తేజ్ హై లెవెల్ హోప్స్ పెట్టుకున్నట్లు సమాచారం. 

డైరెక్టర్​ శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి ఈ మూవీని సితార ఎంటర్​టైన్మెంట్స్​పై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మలయాళ యాక్టర్​ జోజు జార్జ్‌, అపర్ణాదాస్‌, రాధిక కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఆదికేశవ నవంబర్ 24 న థియేటర్లో రిలీజ్ కాబోతుంది.