బెంగళూరు - కోయంబత్తూర్ మధ్య వందే భారత్ రైలు

బెంగళూరు - కోయంబత్తూర్ మధ్య వందే భారత్ రైలు

బెంగళూరు-కోయంబత్తూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని  దక్షణ మధ్య రైల్వే బోర్డు యోచిస్తుంది.  చాలా మంది ప్రజలు ఈ రెండు నగరాల మధ్య తరచుగా ప్రయాణిస్తున్నందున చాలా కాలంగా ప్రజల నుంచి ఈ డిమాండ్‌ కూడా ఉంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని బీజేపీ నేత, యంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యే వనతీ శ్రీనివాసన్ తెలిపారు. 

ప్రస్తుతం బెంగళూరు, కోయంబత్తూరు మధ్య ఒకే ఒక ఎక్స్‌ప్రెస్ రైలు ఉంది. అదే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ .. ఇది సుమారు 7 గంటల ప్రయాణిస్తుంది. ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటిస్తే ప్రయాణికులకు భారీ ఊరట లభించినట్లు అవుతుంది.  

వందేభారత్ రైళ్లు ఇప్పటి వరకు మొత్తం 33 రైళ్లను ప్రవేశ‌పెట్టారు. ఇవి దేశవ్యాప్తంగా వివిధ నగరాలు,రాష్ట్రాల మధ్య నడుస్తున్నాయి. వందే భారత్ రైళ్లలో ఇప్పటి వరకు ఏ ఇతర రైళ్లలోనూ లేని కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి.  ఈ రైళ్లకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికులకు అందుబాటులో ఉండే సేవలను మరింత విస్తరించే దిశ‌గా చ‌ర్యలు చేప‌ట్టింది.