Good News : వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ప్రారంభం అప్పటి నుంచే

Good News : వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ప్రారంభం అప్పటి నుంచే

న్యూఢిల్లీ: త్వరలో వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కబోతున్నది. ఈ తరహా రైలు సేవలు దేశంలో తొలిసారి అందుబాటులోకి రానున్నాయి. స్లీపర్ రైలును పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలువెల్లడించాయి. ప్రస్తుంత వందే భారత్ రైళ్లు చైర్కార్ సర్వీసులను మాత్రమే కలిగివున్నాయి. ఈ నేపథ్యంలో స్లీపర్ రైళ్లు మరో రెండు మాసాలలో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. బహుశా ఆగస్టు 15నాటికి ఇది పట్టాలెక్క వచ్చని తెలుస్తోంది. 

ఇటీవల కేంద్ర రైల్వేమంత్రి స్లీపర్ రైలు పనులను పరిశీలించడానికి బెంగళూరు వెళ్లారు. వందేభారత్ స్లీపర్ రైలు తయారీ చివరిదశలో ఉందని ఆ సందర్భంగా వైష్ణన్ ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. తొలి స్లీపర్ ఢిల్లీ నుంచి భోపాల్, సూరత్ మీదుగా ముంబై చేరుకుంటుంది. ఈ స్లీపర్లోమొత్తం 16 బోగీలు ఉంటాయి. అందులో 10 థర్డ్ క్లాస్ ఏసీకి, 4 సెకండ్ క్లాస్ ఏసీకి, ఒక బోగీ ఫస్ట్ క్లాస్ ఏసీకి కేటాయిస్తారు. సీటింగ్ తోపాటు లగేజీ కోసం (ఎస్ఎల్ఆర్) రెండు బోగీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.