వాంటాబ్లాక్​.. ‘కారు’నలుపు!

వాంటాబ్లాక్​.. ‘కారు’నలుపు!

బీఎండబ్ల్యూ ఎక్స్​6 కారు.. కలర్​, దాని రూపు అదుర్స్​ కదా! ఎప్పుడూ ఉన్న మోడలే కదా.. అందులో కొత్తేంటట అని అంటారా? దాని కలరే.. దానికి గొప్ప మరి. ఆహా, నల్ల రంగుకు అంత గొప్పా అంటే, నిజంగా ఈ నల్ల రంగు గొప్పే మరి. ఎందుకంటే ఇది నలుపుకే రారాజు నలుపు మరి. వాంటాబ్లాక్​ అంటారట ఆ కలర్​ను. 99 శాతం వెలుతురును ఈ నల్ల రంగు శోషించుకుంటుందట. దాని వల్లే భూమ్మీద అత్యంత నల్ల రంగుగా దానికి పేరట. నిజానికి 2016లో బ్రిటన్​ ఆర్టిస్ట్​ అనీశ్​ కపూర్​ ఈ వాంటాబ్లాక్​ కలర్​కు పేటెంట్​ తీసుకున్నారట. కానీ, బీఎండబ్ల్యూ వాడిన వాంటాబ్లాక్​కు కొంచెం మార్పులు చేసింది. వాంటాబ్లాక్​ వీబీఎక్స్​2గా పేరు పెట్టింది. దీంతో పేటెంట్​ గొడవనేది ఉండదట.

ఏ కోణంలో నుంచైనా వెలుతురు దాని మీద పడినప్పుడు కొంచెం రిఫ్లెక్ట్​ అయ్యి కారుకు స్పెషల్​ అట్రాక్షన్​ ఇస్తుందట. అందుకే ఇప్పుడీ ఈ నల్లరంగు బీఎండబ్ల్యూ కారు అంత అందంగా కనిపిస్తుందట. ఈ కారు నలుపు బీఎండబ్ల్యూను సెప్టెంబర్​ 12 నుంచి 22 వరకు ఫ్రాంక్​ఫర్ట్​లో జరిగే మోటార్​ షోలో ప్రదర్శిస్తామని కంపెనీ ప్రకటించింది. డిజైనర్లకు ఈ వాంటాబ్లాక్​ వీబీఎక్స్​2 కొత్త మార్గాలను తెరుస్తుందని దీనికి డిజైన్​ చేసిన హుస్సేన్​ అల్​ అతార్​ చెప్పారు. కాగా, 2014లో బ్రిటన్​కు చెందిన సర్రే నానో సిస్టమ్స్​ ఈ వాంటాబ్లాక్​ కలర్​ను కనిపెట్టింది. అంతరిక్షంలోని సుదూర గెలాక్సీలను స్టడీ చేసేలా ఈ నలుపు రంగును పంపేలా మార్పులూ చేశారు. మునుపు చాలా కంపెనీలు వాంటాబ్లాక్​​ను వాడుకోవాలకున్నా వద్దన్నానని,  బీఎండబ్ల్యూకు మాత్రం బాగా నప్పిందని సర్రే నానో సిస్టమ్స్​ ఓనర్​ బెన్​ జెన్సెన్​ అన్నారు.