
వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sharathkumar) ఆ దర్శకుడికి సెంటిమెంట్ గా మారిపోయిందా? సిచువేషన్స్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఒకటికాదు రెండు కాదు.. వరుసగా మూడు సినిమాల్లో వరలక్ష్మికి ఛాన్స్ ఇచ్చాడు ఆ దర్శకుడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni).
మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వచ్చిన క్రాక్(Krack) సినిమాతో మొదలైంది గోపీచంద్ మలినేని,వరలక్ష్మి కాంబో. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో.. గోపీచంద్ మలినేని,వరలక్ష్మి కంబోపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఆ తరువాత ఈ కాంబోలో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ మూవీ వీరసింహా రెడ్డి(Veerasimhareddy). నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా వచ్చిన ఈ హై వోల్టేజ్ ఫ్యాక్షన్ మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కూడా తన పవర్ఫుల్ నటనతో ఆకట్టుకుంది వరలక్ష్మి. దీంతో గోపీచంద్ మలినేని,వరలక్ష్మి కాంబో సూపర్ హిట్ కాంబోగా మారిపోయింది.
తాజా సమాచారం ప్రకారం గోపీచంద్ మలినేని,వరలక్ష్మి కాంబినేషన్ మరోసారి ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధమైందట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రీసెంట్ గా ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్(Mytri Movie Makers) నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సినిమాలో కూడా వరలక్ష్మి కోసం ఒక పవర్ఫుల్ రోల్ క్రియేట్ చేశాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆ పాత్ర గురించి చెప్పగానే వరలక్ష్మి కూడా వెంటనే ఒకే చెప్పేసిందట. మరి ఈ కాంబో ఈసారి ఆడియన్స్ కు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ పంచుతారో చూడాలి.