Saraswathi Movie: డైరెక్టర్గా వీరసింహారెడ్డి లేడీ విలన్.. పోస్టర్ తోనే థ్రిల్లింగ్ అంశాలు రివీల్

Saraswathi Movie: డైరెక్టర్గా వీరసింహారెడ్డి లేడీ విలన్.. పోస్టర్ తోనే థ్రిల్లింగ్ అంశాలు రివీల్

వెర్సటైల్ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెప్పిస్తున్న వరలక్ష్మి శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ తన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో అడుగు ముందుకు వేశారు. నిర్మాతగా, దర్శకురాలిగా మారుతున్నారు. తన సోదరి పూజా శరత్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి దోస డైరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప్రారంభించారు. ఈ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తొలి చిత్రంగా ‘సరస్వతి’ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆసక్తికరమైన థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శనివారం అనౌన్స్ చేశారు.

సరస్వతి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ఐ’ అనే అక్షరాన్ని రెడ్ కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైలైట్ చేయడం సినిమాలోని ఇంటెన్సిటీని ప్రజెంట్ చేస్తోంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే, వరలక్ష్మి తెలుగులో నాంది సినిమాతో ఎంట్రీ ఇచ్చి  మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత క్రాక్ మూవీతో విలన్‌గా వావ్ అనిపించుకుంది. ఇందులో జయమ్మ పాత్రకు ఆడియన్స్ నుంచి  మంచి ప్రశంసలు దక్కాయి. అనంతరం యశోద, వీర సింహారెడ్డి సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేస్తూ టాలీవుడ్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకుంది. రీసెంట్గా ‘హనుమాన్‌‌‌‌‌‌‌‌’, ‘శబరి’లో నటించి మెప్పించింది.