గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలోఫుడ్​ పాయిజన్​

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలోఫుడ్​ పాయిజన్​
  • రాత్రి భోజనంలో బల్లి పడిన ఆహారాన్ని తిన్న విద్యార్థులు
  • వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన బాలికలు 

వరంగల్ :  వర్ధన్నపేట మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రాత్రి పుడ్​ పాయిజన్​ అయ్యింది. మొత్తం 200 మంది విద్యార్థుల్లో 60 మందికి పైగా విద్యార్థినీలు పుడ్​ పాయిజనింగ్​ కు గురయ్యారు. బల్లి పడిన ఆహారం తినడంతో వాంతులు, విరేచనాలతో 30 మంది విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనంలో బల్లి పడటంతో ఆ భోజనం తిన్న  విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.అస్వస్థతకు గురైన విద్యార్థులను వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి 13 మందిని ఎంజీఎం దవాఖానకు షిఫ్ట్​ చేశారు. వీరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి సీరియస్​ గా ఉందని తెలుస్తోంది. బాధితులకు స్పెషల్ వార్డ్ ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వర్ధన్నపేట ఆస్పత్రిలో కొంతమంది విద్యార్థినులకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు వర్ధన్నపేట CHCకి చేరుకున్నారు. బల్లి పడ్డ ఆహారం తినడంతో సమస్య మొదలైందని అంటున్నారు. 

నివేదిక కోరిన జిల్లా కలెక్టర్​ 
వర్ధన్నపేట మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో రాత్రి పుడ్​ పాయిజన్​పై నివేదిక అందించాలని వరంగల్ కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. నిన్న రాత్రి విద్యార్థినీలు అస్వస్థతకు గురైన వెంటనే ఎంజీఎం హాస్పిటల్ కు వెళ్లి బాధితులను కలెక్టర్ పరామర్శించారు. బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎంజీఎం సూపరింటెండెంట్ తో మాట్లాడారు.

విద్యార్థి సంఘాల ఆగ్రహం
వర్ధన్నపేట ప్రభుత్వ బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత జరగడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. వరంగల్ ఎంజీఎం ముందు ఆందోళనకు దిగారు. స్టూడెంట్స్ కు మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని.. అక్కడి నుంచి పంపించారు. మరోవైపు ఫుడ్ పాయిజన్ ఘటనపై పేరెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బల్లి పడిందని చెప్పినా కూడా.. తీసేసి తినమని చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే తమ పిల్లలు హాస్పిటల్ పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.