మామిడి వంటలు.. వెరైటీ రెసిపీలు.. టేస్ట్ అదిరిపోద్ది..

 మామిడి వంటలు.. వెరైటీ రెసిపీలు.. టేస్ట్ అదిరిపోద్ది..

పిందె నుంచి పండు వరకూ మామిడి రుచే వేరు. అందుకే వేసవి వస్తోందంటే చాలు ఈ పండ్ల కోసం ఎదురుచూపులు మొదలవుతాయి. చిన్నా, పెద్దా అంతా మామిడి రుచిని ఆస్వాదిస్తుంటారు. ఆహా! ఏమి రుచి అంటూ మామిడిని పొగుడుతుంటారు కూడా. అయితే అందరి హాట్ ఫేవరెట్ మామిడిని ఎప్పుడూ ఒకేలా ఎందుకు తినాలి. వెరైటీగా వండుకుని తినొచ్చుగా. ..అదెలా అంటారా! అయితే  వెరైటీగా మామిడి  రెసిపీలు ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

మామిడితో ఫాలుదా వెరైటీ రెసిపీ తయారీకి కావాల్సినవి 

  • పాలు- పావు లీటర్ 
  • సేమ్యా(నానబెట్టిన)- అరకప్పు
  •  మామిడిపండు గుజ్జు- ఒకకప్పు
  •  రోజ్ సిరప్- రెండు టేబుల్ స్పూన్లు 
  • సబ్జా గింజలు (నానబెట్టిన) - పావు కప్పు
  •  చక్కెర - రెండు టేబుల్ స్పూన్లు 
  •  పచ్చికోవా- కొద్దిగా
  •  ఐస్ క్యూబ్స్ - తగినన్ని
  •  బాదం పలుకులు- కొన్ని

మామిడితో ఫాలుదా వెరైటీ రెసిపీ తయారీ విధానం

  గిన్నెలో పాలు పోసి చక్కెర, రోజ్ సిరప్, ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలపాలి. సర్వింగ్ గ్లాస్లో కొన్ని సబ్జా గింజలు కొద్దిగా నానబెట్టిన సేమ్యా మామిడి పండు గుజ్జు, పచ్చికోవా వేయాలి. 

అందులో ముందుగా చేసి పెట్టిన పాల మిశ్రమం కూడా కలపాలి. తర్వాత నానబెట్టిన సబ్జా గింజలు, రోజ్ సిరప్, మ్యాంగో గుజ్జు వేయాలి. చివరిగా బాదం తరుగుతో గార్నిష్ చేస్తే మ్యాంగో ఫాలుడా రెడీ.

 మ్యాంగో పాప్సికల్స్ తయారీకి కావాల్సినవి 

  •  మామిడి పండ్లు - రెండు, 
  • తేనె - 15 మిల్లీ లీటర్లు, 
  • కొబ్బరి పాలు - 50 మిల్లీ లీటర్లు 
  • ఆరెంజ్ జ్యూస్ -  3 మిల్లీ లీటర్లు

 మ్యాంగో పాప్సికల్స్ తయారీ విధానం

 ముందుగా మామిడి పండ్లు తొక్క తీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. మిక్సీ జార్లో మామిడి ముక్కలు, తేనె, కొబ్బరి పాలు, ఆరెంజ్ జ్యూస్ వేసి మిక్సీ పట్టి గుజ్జు చేయాలి.

ఆ మిశ్రమాన్ని చాకోబార్ మౌల్డ్ లో వేసి 4 గంటలు ఫ్రిజ్ లో పెడితే మ్యాంగో పాప్సికల్స్ రెడీ, చాకోబార్ మాల్ట్ కి బదులు గ్లాసుని కూడా వాడొచ్చు  . ఉన్న గ్లాసులో మ్యాంగో గుజ్జు వేసి ఐస్ పుల్ల గుచ్చి ఫ్రిజ్ లో పెట్టినా పాప్పికల్స్ పర్ఫెక్ట్ గా వస్తాయి 

మ్యాంగో కేక్  తయారీకి కావాల్సినవి 
  

  • మామిడిపండు గుజ్జు - అర కప్పు,
  •  చక్కెరపొడి- 75 గ్రాములు
  •  మైదా- 180 గ్రాములు 
  • వెన్న- 75 గ్రాములు
  •  కోడి గుడ్డు-ఒకటి. 
  • టూటీ ఫ్రూటీ- కొద్దిగా
  •  బేకింగ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్- ఒక టీ స్పూన్ 
  • కండెన్స్ డ్  మిల్క్ - ఒక టేబుల్ స్పూన్

మ్యాంగో కేక్​తయారీ విధానం

గుడ్డు తెల్ల సొనలో వెనిల్లా ఎసెన్స్ లో  వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో వెన్న, చక్కెర పొడి వేసి ఐదునిమిషాలు కలపాలి. 

అందులో కోడిగుడ్డు తెల్లసాన మిశ్రమం, పచ్చసొన, మామిడి పండు గుజ్జు కూడా వేసి మరోసారి కలపాలి. తర్వాత కండెన్స్ డ్ మిల్క్, బేకింగ్ పౌవర్. టూటీ ఫ్రూటీ, మైదా వేసి మరికాసేపు కలపాలి.

 ఆ మిశ్రమాన్ని వెన్న రాసిన ఇడ్లీ పాత్రలో వేసి ఇరవై నిమిషాలు ఉడికిస్తే మ్యాంగో కేక్ రెడీ.

మామిడితో శ్రీఖండ్  తయారీకి కావలసినవి

  • మామిడిపండు గుజ్జు - ఒక కప్పు
  •  పెరుగు - అరకిలో 
  • చక్కెర పొడి - అర కప్పు 
  • యాలకుల పొడి- అర టీస్పూన్ 
  • పిస్తా- కొద్దిగా

మామిడితో శ్రీఖండ్ తయారీ విధానం

 పెరుగుని ఒక పలుచటి బట్ట వేసి నీళ్లు మొత్తం పోయేలా గట్టిగా పిండాలి. పెరుగు గట్టి పిండక గిన్నెలోకి తీయాలి.

 అందులో చక్కెర పొడి వేసి బాగా కలపాలి. తర్వాత మామిడి పండు గుజ్జు, యాలకుల పొడి, పిస్తా పలుకులు వేసి ఇంకాసేపు కలిపితే మ్యాంగో శ్రీఖండ్ రెడీ.

మామిడి తాండ్ర తయారీకి కావలసినవి

  • మామిడిపండ్లు- మూడు
  • చక్కెర- 100 గ్రాములు 
  • యాలకులు- మూడు
  • నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు

మామిడి తాండ్ర తయారీ విధానం

  మామిడి పండ్లు తొక్క తీసి ముక్కలుగా తరగాలి. వాటిని మిక్సీ పట్టి, గుజ్జును గిన్నెలోకి తీయాలి. పాన్ వేడిచేసి మామిడి పండు గుజ్జు వేసి దగ్గర పడే వరకు ఉడికించాలి. దగ్గర దగ్గర సన్నటి మంటపై పావుగంట నుంచి ఇరవై నిమిషాలు ఉడికాక చక్కెర, యాలకులు వేయాలి.

 చక్కెర బాగా కరిగి పాకంలా అయ్యేవరకు ఉడికించాలి. మిశ్రమం సగానికి సగం అయ్యాక స్టవ్ ఆపాలి. నెయ్యి రాసిన ప్లేట్ లో మిశ్రమాన్ని సమంగా పరవాలి. మూత పెట్టి ఆ ప్లేటిని వారం రోజులు ఎండలో పెట్టి నచ్చిన షేప్ లో కట్ చేయాలి. అంతే మామిడి తాండ్ర రెడీ.