ది కానిస్టేబుల్... వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌

ది కానిస్టేబుల్... వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌

‘హ్యాపీడేస్’ చిత్రంతో పదహారేళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్.. తర్వాత కెరీర్‌‌‌‌‌‌‌‌లో సక్సెస్‌‌‌‌లు అందుకోలేక పోయాడు. ఇటీవల ‘మైఖేల్’ మూవీతో తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేసిన వరుణ్.. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌ చిత్రాల్లో నటిస్తున్నాడు. శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా ఆయా మూవీ టీమ్స్ కొత్త అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో  వరుణ్‌‌‌‌కి బర్త్‌‌‌‌డే విషెస్‌‌‌‌ను తెలియజేశాయి. 

‘ది కానిస్టేబుల్’ చిత్రంలో వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో కానిస్టేబుల్ గెటప్‌‌‌‌లో ఇంటెన్స్‌‌‌‌గా కనిపిస్తున్నాడు వరుణ్.  ఆర్యన్ సుభాన్ ఎస్‌‌‌‌.కె.దర్శకత్వంలో బలగం జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతోపాటు ‘యద్భావం తద్భావతి’ చిత్రంలో నటిస్తున్నాడు వరుణ్ సందేశ్. మోషన్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో తనకు విషెస్ చెప్పారు మేకర్స్.  అలాగే  ‘చిత్రం చూడర’ సినిమా యూనిట్ కూడా వరుణ్‌‌‌‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆర్ఎన్ హర్షవర్ధన్ దీనికి దర్శకుడు. ధనరాజ్, కాశీ విశ్వనాథ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.