
వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. ఈ మూవీ రిలీజ్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకి ఫిబ్రవరి 25కి ఫిక్సయ్యారు. కానీ అదే తేదీకి పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ వస్తుండటంతో మరోసారి తమ చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే మరో కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తామని చెప్పారు. ‘భీమ్లానాయక్’ మాస్ జాతర థియేటర్స్‌లో చూడటానికి అందరిలాగే తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు ‘గని’ మేకర్స్. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబి, సిద్ధు ముద్ద నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. మరోవైపు వెంకటేష్‌తో కలిసి వరుణ్ నటిస్తున్న ‘ఎఫ్3’ మే27న ప్రేక్షకుల ముందుకు రానుంది.