మంత్రి జగదీష్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నడు.. అవి ఎక్కడ పెట్టాడో త్వరలోనే చెప్తా

మంత్రి జగదీష్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నడు.. అవి ఎక్కడ పెట్టాడో త్వరలోనే చెప్తా

అధికార బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతుంది. పబ్లిక్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ నేతలే తిరుగుబాటు గళం వినిపిస్తున్నారు. తాజాగా సూర్యాపేట ఎమ్మెల్యే మంత్రి జగదీష్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత,ఉమ్మడి నల్గొండ డీసీఎంఎస్‌  చైర్మన్‌ వట్టే జానయ్య యాదవ్  తిరుబావుటా ఎగురవేశారు.   

వేల కోట్ల ఎక్కడున్నాయంటే..

తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు మంత్రి జగదీష్ రెడ్డి  కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వట్టే జానయ్య యాదవ్ ఆరోపించారు. అందుకే తనపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి జగదీష్ రెడ్డి అవినీతి చిట్టా తన దగ్గర ఉందని చెప్పారు. త్వరలోనే ఆయన అవినీతిని బయటపెడతానని చెప్పుకొచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డి వేల కోట్లు ఎక్కడ పెట్టారో తనకు తెలుసని వెల్లడించారు. త్వరలోనే బయటపెడతానని చెప్పారు.  ఎన్నికల్లో పోటీ చేస్తానని..మంత్రి జగదీష్ రెడ్డిపై తిరగబడటంతోనే తన మీద ఒక్కరోజే 70 అక్రమ కేసులు పెట్టారని తెలిపారు.  బడుగు బలహీనవర్గాలకు సరైన న్యాయం జరగడం లేదని ప్రశ్నించడం వలన మంత్రి జగదీష్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.