లంబసింగి మూవీ నుండి వయ్యారి గోదారి పాట విడుదల

లంబసింగి మూవీ నుండి వయ్యారి గోదారి పాట విడుదల

ఆంధ్రా కాశ్మీర్‌‌గా పాపులర్ అయిన ‘లంబసింగి’ ఊరి పేరుతో ఇప్పుడో సినిమా వస్తోంది. ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’ అనేది ట్యాగ్‌‌లైన్.  భరత్‌‌ రాజ్, ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి జంటగా నవీన్ గాంధీ తెరకెక్కించాడు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో టి.ఆనంద్ నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన ‘నచ్చేసిందే నచ్చేసిందే..’ పాటకు మంచి స్పందన రాగా, తాజాగా ‘వయ్యారి గోదారి’ అనే పాటను విడుదల చేశారు. 

ఆర్ఆర్ ధ్రువన్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్‌‌ను జవేద్ అలీ పాడాడు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా అవుతుందని మేకర్స్ తెలియజేశారు.