మనకు నిరంతర స్ఫూర్తి వీడీ సావర్కర్ : ప్రధాని నరేంద్ర మోడీ

మనకు నిరంతర స్ఫూర్తి వీడీ సావర్కర్ : ప్రధాని నరేంద్ర మోడీ
  • 101వ మన్​కీ బాత్​లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య పోరాట యోధుడు, హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ ధైర్యం, సంకల్పం, త్యాగం మనందరికీ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నిర్భయత్వం, ఆత్మాభిమానానికి సావర్కర్ ప్రతీక అని, బానిస మనస్తత్వాన్ని సహించేవారు కాదని చెప్పారు. మనదేశం ఉన్నతస్థాయిలో ఉందంటే సావర్కర్ వంటి మహనీయుSenior NTTRల కృషే కారణమని కొనియాడారు. ఆదివారం 101వ మన్​కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో మాత్రమే కాదు, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం వీర్ సావర్కర్ చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. అండమాన్ జైలులో సావర్కర్ గదిని సందర్శించిన రోజును ఎన్నటికీ మరువలేనని చెప్పారు. అంతకుముందు పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్‌‌‌‌లో మోడీ, లోక్‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ఎంపీలు.. ఆదివారం సావర్కర్ జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఎన్టీఆర్​కు నివాళి

యాక్టర్, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా పీఎం మోడీ నివాళి అర్పించారు. రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. 300కు పైగా సినిమాల్లో నటించి, ఎన్నో చారిత్రాత్మక పాత్రలకు జీవం పోశారని గుర్తుచేశారు. ఇప్పటికీ రాముడు, కృష్ణుడు పాత్రల్లో జనం ఎన్టీఆర్​నే గుర్తుచేసుకుంటున్నారని  చెప్పారు.