విదేశాంగ శాఖ రోజువారీ మీడియా వ్యవహారాల నిర్వహణ

విదేశాంగ శాఖ రోజువారీ  మీడియా వ్యవహారాల నిర్వహణ

వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్​ డిప్యూటీ ప్రతినిధి వేదాంత్​ పటేల్.. ఆ శాఖకు సంబంధించి రోజువారి మీడియా వ్యవహారాలు నిర్వహించనున్నారు. ఈ బాధ్యతలు చేపట్టిన ఫస్ట్​ ఇండియన్​ అమెరికన్​గా ఆయన చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్​ ప్రైస్​ సెలవుల్లో ఉండడంతో 33 ఏళ్ల పటేల్​కు మీడియా వ్యవహారాల బాధ్యత అప్పగిం చారు. దీంతో ఆయన మంగళవారం విదేశాంగ విభాగంలో మొదటిసారిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్​పై రష్యా దురాక్రమణ, లిజ్​ ట్రస్​ యూకే ప్రధాని అవడం, ఇరాన్  న్యూక్లి యర్​ అంశాలపై ఆయన మాట్లడారు. కాగా, మీడియా వ్యవహారాల బాధ్యత చేపట్టిన పటేల్​కు పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.