
ములుగు, వెలుగు: మండలంలోని బైలంపూర్ గ్రామంలో ఆదివారం మండల రజక సంఘం అధ్యక్షుడు మెతుకు బాలమల్లు ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్రవీందర్ రెడ్డి, ఎస్ఐ విజయ్ కుమార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని యువత సమస్యలపై పోరాడాలన్నారు.
కార్యక్రమంలోని గజ్వేల్ నియోజకవర్గం రజక సంఘం అధ్యక్షుడు ఎల్లేశ్, ములుగు మండల రజక సంఘం అధ్యక్షుడు కనకరాజు, నర్సింలు, శ్రీధర్, మాజీ సర్పంచ్ మధుసూదన్, ఆంజనేయులు, స్వామి, మహేశ్, సతీశ్, అనిల్, శివ కుమార్, నరసింహులు, సంతోష్, భాస్కర్ పాల్గొన్నారు.