సైకో గా వెంకటేష్.. సరికొత్తగా సైంధవ్‌ టీజర్

సైకో గా వెంకటేష్.. సరికొత్తగా సైంధవ్‌ టీజర్

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) హీరోగా వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ సైంధవ్‌ (SAINDHAV). హిట్‌ చిత్రాల దర్శకుడు శైలేష్‌ కొలను(Sailesh kolanu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వెంకట్‌ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న 75వ సినిమా కావడంతో సైంధవ్‌ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాదు ఆయన నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం.

ఇప్పటికే సైంధవ్‌ నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చాల స్టైలీష్ గా ఉంది. చాలా కాలం తరువాత వెంకటేష్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సౌత్ ఇండియాలోని చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియాలో డ్ర‌గ్స్ మాఫియాను అరికట్టడానికి సైకోగా వెంకటేష్ బరిలోకి దిగనున్నారు. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవల్లో ఉండనున్నాయని టీజర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. దీంతో ఈ సినిమా కోసం వెంకీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, రుహాణి శర్మ, ఆండ్రియా, తమిళ హీరో ఆర్య, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చాలా కాలం తరువాత యాక్షన్ మూవీ చేస్తున్న వెకంటేష్ కు సైంధవ్‌  ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.