సంక్షేమ హాస్టళ్లకు మెస్​ బిల్లులు చెల్లించాలి : వేముల రామకృష్ణ

సంక్షేమ హాస్టళ్లకు మెస్​ బిల్లులు చెల్లించాలి : వేముల రామకృష్ణ

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు బకాయిలు చెల్లించాలని బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. 10 నెలలుగా మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు సరైన ఆహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విద్యానగర్ బీసీ భవన్ లో సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులపై విద్యార్థి నాయకుల సమావేశం జరిగింది.

 ఈ సందర్భంగా వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వం బిల్లులు పెండింగ్​పెట్టడంతో హాస్టళ్లకు సరఫరా చేయాల్సిన నిత్యవసరాలు, కూరగాయలను వ్యాపారస్తులు నిలిపి వేస్తున్నారని చెప్పారు. ఫలితంగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన హాస్టల్ విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పోరుకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.