వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి హుండీ ద్వారా రూ. 1 కోటి 97 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో రాధాబాయి తెలిపారు. 34 రోజులకు గాను రాజన్న హుండీని బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో అధికారుల పర్యవేణక్షలో ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు మధ్య సిబ్బంది లెక్కించారు. ఆలయానికి రూ.1 ,97,54 ,588 నగదు, 170 గ్రాముల బంగారం,10 .300 కిలోల వెండి వచ్చింది. హుండీ లెక్కింపులో ఏసీ ఆఫీసు పరిశీలకులు సత్యనారాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, సిబ్బంది, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
