కార్తీక మాసంలో రాజన్నకు రూ.8.22కోట్ల ఆదాయం

కార్తీక మాసంలో రాజన్నకు రూ.8.22కోట్ల ఆదాయం

వేములవాడ, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసంలో భారీగా ఆదాయం వచ్చింది. ఈ నెల రోజుల్లో రాజన్న ఆలయానికి రూ.8 కోట్ల 22 లక్షల 67 వేల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని వివిధ రుపాల్లో మొక్కులు చెల్లించారు. 

హుండీ ద్వారా రూ.4.22 కోట్లు, కోడె టికెట్ల ద్వారా రూ.1.65 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.1.73 కోట్లు, రుద్రాభిషేకం టికెట్ల ద్వారా రూ.24 .18 లక్షలు, శీఘ్ర, బ్రేక్‌‌‌‌ దర్శనాల ద్వారా రూ.63.53 లక్షలు, కల్యాణం టికెట్ల ద్వారా రూ.39.60 లక్షలు, ఇతరత్రా సేవల టికెట్ల ద్వారా రూ.66.73లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

కాగా హుండీని రెండు సార్లు లెక్కించాల్సి ఉండగా ఒకేసారి లెక్కించగా.. రూ.1.50కోట్లు ఆదాయం మాత్రమే వచ్చిందని, మరోసారి లెక్కిస్తే మరింత పెరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.