
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరి పేరును ప్రతిపాదించాలి ? అనే దానిపై బీజేపీ ముమ్మర కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించేందుకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఇది ప్రారంభం కావడానికి ముందు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా కలిసి వెళ్లి ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడును కలిశారు. దాదాపు గంటపాటు ఈ భేటీ జరిగింది. వాస్తవానికి మంగళవారం ఉదయం సికింద్రాబాద్ లో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. అనంతరం భాజపా ముఖ్య నేతలతో భేటీ కోసం ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈనేపథ్యంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును బీజేపీ పరిశీలిస్తోందంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.