బిగ్​బాస్​ సీజన్​–6లో నాగార్జున వెంకట్​ డిజైన్​ చేసిన డ్రెస్​ వేసుకున్నారు

బిగ్​బాస్​ సీజన్​–6లో నాగార్జున  వెంకట్​ డిజైన్​ చేసిన డ్రెస్​ వేసుకున్నారు

ఊహ తెలిసీ తెలియడంతోనే ఆర్టిస్ట్​ అయ్యారు వెంకట్​ గడ్డం. పన్నెండేండ్ల వయసులోనే వెంకట్ ​వేసిన పెయింటింగ్స్​ ఎగ్జిబిషన్​కి చేరాయి. అలా మొదలైన జర్నీ.. ఇప్పుడు ఫ్యాషన్​ డిజైనింగ్​లో ఒక ట్రెండ్​ సెట్ చేసింది. ఆయన డిజైన్​ చేసిన ఫ్యాషన్​లైన్​ను​ మామూలు జనం మొదలు సెలబ్రిటీల వరకు అందరూ ఇష్టపడుతున్నారు. 

నాకు ఊహ తెలిసినప్పటి నుంచే ఆర్టిస్ట్​ని. మొదటి పెయింటింగ్​ ఎప్పుడు వేశానో నాకే గుర్తులేదు. అంత చిన్న వయసులో కుంచె పట్టా. అలా పెయింటింగ్​ నేర్చుకోకముందే ఆర్టిస్ట్ అయ్యా. అలాగే మ్యూజిక్​లో బేసిక్స్​ కూడా నేర్చుకోకున్నా పాటలు కూడా పాడతా” అన్నారు వెంకట్​ గడ్డం. ఒక ఆర్ట్​ని పూర్తిగా నేర్చుకోవడానికి, దానిపై పని చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ.. వెంకట్​ ఆర్టిస్ట్​గా సక్సెస్ కావడమే కాకుండా.. ఇప్పుడు ఫ్యాషన్​ డిజైనర్​గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘‘WHENCUT GODDAMN” బ్రాండ్​ నేమ్​తో వచ్చిన ఆయన డిజైన్స్​ చాలా పాపులర్​ అయ్యాయి.  

చిన్నప్పటినుంచే బొమ్మలు

చిన్నప్పుడే ఆర్ట్​  మీద ఇంట్రెస్ట్​ కలిగింది వెంకట్​కు. దాంతో తెలియకుండానే ఆర్టిస్ట్​ అయిపోయారు. స్కూల్​లో ఉన్నప్పుడు కూడా అన్ని సబ్జెక్ట్స్​​కన్నా క్రియేటివ్​ ఫీల్డ్స్​ బాగా నచ్చేవి. అప్పుడు కూడా పెయింటింగ్, రైటింగ్​లో ఎప్పుడూ ఫస్టే. తర్వాత న్యూయార్క్​ వెళ్లి ఆర్ట్స్​లో నాలుగేండ్లు అండర్​ గ్రాడ్యుయేషన్ చేశారు. అప్పుడే గోడల మీద ఆర్ట్​ వేయడం మొదలుపెట్టారు. అంతేకాదు.. తన వంతు సొసైటీకి ఏదైనా చేయాల్సి వస్తే.. అది కూడా తన ఆర్ట్​ ద్వారానే చేస్తానంటున్నారు. అందుకే తన పెయింటింగ్స్​, రచనల ద్వారా ఇన్​స్పైర్ చేస్తున్నారు.  

విమెన్ ఎందుకు? 

వెంకట్​ ఆర్ట్​లో ఎక్కువగా ఆడవాళ్లు, వాళ్ల మనోభావాలు కనిపిస్తుంటాయి. అదే విషయం ఆయన్ని అడిగితే.. ‘‘నా దృష్టిలో విమెన్, మెన్​ ఇద్దరూ సమానమే. నా ఆర్ట్​లో విమెన్​ని చూడడం కంటే హ్యూమన్​ బీయింగ్స్​ని చూడాలి. ఆడవాళ్లు నా ఆర్ట్​​లో క్యారెక్టర్స్ మాత్రమే​. నేను చెప్పదలచుకున్నది ఆ క్యారెక్టర్స్​ కథల ద్వారా చెప్తున్నా. అవి మెన్​, విమెన్​ ఇద్దరికీ కనెక్ట్ అవుతాయి. అందుకే చాలామంది మగవాళ్లు కూడా ఆ క్యారెక్టర్స్​లా ఫీల్​ అవుతుంటారు. నేను ప్రతి పెయింటింగ్​కి దాన్ని రిప్రజెంట్​ చేసే ఒక క్యాప్షన్​ రాస్తుంటా. ఆ క్యాప్షన్ చూసి చాలామంది అందులో తమను చూసుకున్నట్టు చెప్పారు. నా ఆర్ట్​ వర్క్​ అలా ఉండడానికి కారణం మా అమ్మే. ఆమే నాకు ఇన్​స్పిరేషన్​. ఒక హ్యూమన్​ బీయింగ్​లా ఎలా ఉండాలో నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నా. అందుకే ఎదుటి వ్యక్తి ఎమోషన్స్​ని ఈజీగా అర్థం చేసుకోగలను. ఆ ఎమోషన్స్​ నా ఆర్ట్​లో కనిపిస్తుంటాయి. అందుకే అందరికీ అర్థమవుతాయి” అని వివరించారు.  

ఆర్ట్​– ఫ్యాషన్​

ఒక ఆర్టిస్ట్ ఏ పని చేసినా ఆ పని కళాత్మకంగా మారుతుంది. అందుకే  వెంకట్ డిజైన్​ చేసే బట్టల్లోనూ ఆర్ట్​ కనిపిస్తుంది. వాటి రూపురేఖలు ఆర్టిస్టిక్​గా ఉంటాయి. పెయింటింగ్స్​నే బట్టలపై ప్రింట్​ చేసినట్టు ఉంటుంది. ఆయన డిజైనింగ్​ అలా ఉండడానికి కారణం ఉంది. వెంకట్​ చిన్నప్పుడు ఒకసారి ఎం.ఎఫ్.​ హుస్సేన్​ కూతురిని చూశారు. అప్పుడామె కట్టుకున్న చీర చాలా డిఫరెంట్​గా అనిపించింది. ఆమె ఆ చీరపై వాళ్ల నాన్న వేసిన పెయింటింగ్​ని ప్రింట్​ చేయించుకుంది. అప్పుడే ఆయనకు ఆర్ట్​ డిజైన్​ ఐడియా వచ్చింది.   

సెలబ్రిటీల వరకు 

వెంకట్​ డిజైన్​ చేసిన బట్టలు చాలామంది ఇష్టపడుతుంటారు. ఆర్ట్​ వర్క్​ యునిక్​ స్టైల్​లో ఉండటమే అందుకు కారణం. ఉదాహరణకు ఒక షర్ట్​ డిజైన్​ చేస్తే అది నార్మల్​ షర్ట్​లా ఉండదు. బోల్డ్, డిఫరెంట్​గా ఉంటుంది. దాన్ని ఎక్కడ చూసినా ఇది వెంకట్​ డిజైన్​ అని గుర్తుపట్టొచ్చు. మామూలుగా మార్కెట్​లోకి ఒక కొత్త స్టైల్​ వచ్చిందంటే ట్రై చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ.. వెంకట్​ డిజైన్స్ విషయంలో మాత్రం చాలామంది అవి నచ్చడం వల్ల వేసుకుంటున్నారు. ఈ మధ్య బిగ్​బాస్​ సీజన్​–6లో హీరో నాగార్జున కూడా వెంకట్​ డిజైన్​ చేసిన డ్రెస్​ వేసుకున్నారు. 

మల్టీ టాలెంటెడ్​

కళకు పరిధి లేదు. అది ఎక్కడివరకైనా రీచ్​ అవుతుంది అంటుంటారు. క్రియేటివిటీ ఉంటే ఆర్ట్​.. దానికి అనుబంధంగా ఉన్న అన్ని రంగాలకు విస్తరిస్తుంది అంటారు వెంకట్. అందుకేనేమో ఆయన ముందు ఆర్టిస్ట్​ అయ్యి.. ఆ తర్వాత పాట, కవిత్వం, ఫ్యాషన్​ డిజైనింగ్​లో కూడా సక్సెస్​ అయ్యారు. ఇన్నింటిలో ఉండటం ఎలా సాధ్యమైందని అడిగితే.. “క్రియేటివ్​గా ఆలోచించే వాళ్ల ఆర్ట్​కి హద్దులు ఉండవు. ఒక నదిలా ఎప్పుడూ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఆ ఫ్లో నుంచే సింగింగ్, రైటింగ్, డిజైనింగ్, పెయింటింగ్ వంటివి నాకు వచ్చాయి” అన్నారు వెంకట్​. 

పేరు కూడా యునిక్​

మామూలుగా వెంకట్​ గడ్డం అనే పేరుని ఇంగ్లీష్​లో ‘‘VENKAT GADDAM” అని రాస్తారు. కానీ.. వెంకట్​ మాత్రం ‘‘WHENCUT GODDAMN” అని డిఫరెంట్​గా రాస్తుంటారు. అదే ఆయన బ్రాండ్​నేమ్​. ఇలా రాయడం వెనక ఒక కారణం ఉంది. అదేంటంటే.. న్యూయార్క్​లో అండర్​ గ్రాడ్యుయేషన్​​ చేస్తున్నప్పుడు అక్కడి వాళ్లకు వెంకట్​ పేరును ఎలా పలకాలో తెలిసేది కాదు. దాంతో వాళ్లకు అర్థమయ్యేలా ‘‘వెన్​ కట్​ గాడ్​ డామ్’’​ అని విడదీసి చెప్పేవారు. ఇలా రాయడం యునిక్​గా ఉండడంతో అదే బ్రాండ్​నేమ్​గా పెట్టారు.

ఆలోచనల నుంచే ఆర్ట్​ 

‘‘దేన్నైనా కళాత్మకంగా చూడాలి. అందుకే నేనేది చేసినా చాలా కాన్సన్​ట్రేట్​గా చేస్తుంటా. ఉదాహరణకు ఒక సినిమా చూసినా, ఎవరితోనైనా మాట్లాడినా, ఏదైనా చదివినా.. వాటి తాలూకు గుర్తులు నాతో నడుస్తూనే ఉంటాయి. వాటి నుంచి కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనల నుంచే ఆర్ట్​ పుడుతుంది.’’