రియల్టర్లు, కాంట్రాక్టర్లు వెళ్లిపోవచ్చు: కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

రియల్టర్లు, కాంట్రాక్టర్లు వెళ్లిపోవచ్చు: కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

 

  • బీసీలను అవమానిస్తే ఊరుకునేదిలేదు

యాదాద్రి, వెలుగు: రియల్టర్లు, కాంట్రాక్టర్లు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని, బీసీలను అవమానిస్తే ఊరుకునేది లేదని -ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి హెచ్చరించారు. భువనగిరిలో బుధవారం జరిగిన పార్లమెంట్​స్థాయి మీటింగ్‌‌కు పార్లమెంట్​ కో ఆర్డినేటర్, కర్ణాటకలోని హంగల్‌‌ ఎమ్మెల్యే శ్రీనివాస్​ మానెతో కలిసి హాజరయ్యారు.  ఈ సందర్భంగా వెంకట్‌‌రెడ్డి మాట్లాడుతూ తనకు పదవులు అవసరం లేదని ప్రజల కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. తనకు ఏ వ్యాపారం లేదని, కొండలు, గుట్టలు అమ్ముకోవడం తెలియదన్నారు.  బీసీలు మీటింగ్ పెట్టుకుంటే కాంగ్రెస్​ నుంచి వెళ్లిపోయిన వ్యక్తికి ఎమ్మెల్సీ వచ్చినా, రియల్​ఎస్టేట్​ వ్యాపారం చేసుకున్నా తనకు అవసరం లేదని, బీసీలపై అవాకులు చెవాకులు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.  కేసీఆర్​ కేబినెట్​లోఎక్కువ మంది ఓసీలే ఉన్నారని ,  మాదిగలకు ప్రాతినిధ్యమే ఇవ్వలేదన్నారు. 

ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ లీజుకు ఇచ్చిన కేసీఆర్​ఆ డబ్బుతో రుణమాఫీ వడ్డీ మాత్రమే మాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. గంధమల్ల రిజర్వాయర్​ పనులను గుత్తా సుఖేందర్​ రెడ్డి వియ్యంకుడికి ఇచ్చారన్నారు. మంత్రి కేటీఆర్‌‌‌‌ తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు  అమెరికాలో బాత్రూమ్​లు కడుతున్నారని విమర్శించారు.   ఒక్కో పార్లమెంట్​ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని పార్టీ  హై కమాండ్​నిర్ణయించిందని, టికెట్ల కోసం ఎవరైనా అప్లై చేసుకోవచ్చని సూచించారు.  - 
బీఆర్‌‌‌‌ఎస్‌‌, బీజేపీ ఒక్కటేశ్రీనివాస్​ మానె మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్​ఒక్కటేనని, బయట శత్రువులుగా కనిపిస్తూ ఇంటర్నల్‌‌గా కలిసే ఉంటున్నాయని విమర్శించారు.  ఆ రెండింటిని ఓడించాలంటే పార్టీ లీడర్లు సమష్టిగా పని చేయాలని సూచించారు. భువనగిరి పార్లమెంట్​ పరిధిలోని  ఏడింటికి ఏడు గెలుస్తేనే  రాష్ట్రంలో టార్గెట్​ రీచ్​ అవుతామన్నారు. గెలిచిన తర్వాత సంబరాలు.. నన్మానాలు చేసుకుందామని ఇప్పుడు కాదన్నారు.  

పార్టీలో కోవర్డులున్నరు

అంతకుముందు పలువురు లీడర్లు మాట్లాడుతూ పార్టీలో కోవర్డులున్నారని, వారిని గుర్తించి బయటికి పంపాలని కోరారు.  పార్టీలో కేడర్​ మనోభావాలని పరిగణలోకి తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని విస్మరించి..రెడిమేడ్​ లీడర్లకు ప్రయారిటీ ఇస్తున్నారని ఆరోపించారు.  ఉదయగిరి డిక్లరేషన్​ ప్రకారం ఒక్క పార్లమెంట్​ పరిధిలో మూడు అసెంబ్లీ సీట్లను బీసీలకే ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు పాల్వయి స్రవంతి, అండెం సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్​ నగేశ్​, టీపీసీసీ సెక్రటరీలు బీర్ల అయిలయ్య, పోత్నక్​ ప్రమోద్​ కుమార్​, తంగెళ్లపల్లి రవికుమార్​, బోరెడ్డి అయోధ్యరెడ్డి, కల్లూరి రాంచంద్రారెడ్డి, బండ్రు శోభారాణి, భువనగిరి పార్లమెంట్‌‌ పరిధిలోని లీడర్లు పాల్గొన్నారు.