
ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల లీడర్లను జై తెలంగాణ పత్రిక ద్వారా దేశాయి సముచితంగా గుర్తింపునిచ్చారు. కాసు బ్రహ్మానందారెడ్డి మంత్రివర్గం నుంచి తెలంగాణ కోసం మొట్టమొదలు రాజీనామా చేసిన కొండా లక్ష్మణ్‌బాపూజీ, తెలంగాణ కోసం నిలబడిన హైదరాబాద్రెండో మేయర్ ఎన్. లక్ష్మీనారాయణ, తెలంగాణ కోసం ఎంపీలుగా కొట్లాడిన జీఎస్ మెల్కోటే, గడ్డం వెంకటస్వామి, ఎం. నారాయణ రెడ్డి, ఎన్. రామచంద్రారెడ్డి, వీబీ. రాజు, ఎన్జీవోస్యూనియన్ ప్రెసిడెంట్జీఆర్పిళ్లై, కార్మిక నాయకుడు వెంకటేశం, తెలంగాణ కేసరిగా గుర్తింపు పొందిన కేవీ రంగారెడ్డి, ఏపీ అసెంబ్లీలో మొట్టమొదటి సారి ‘జై తెలంగాణ’ అని నినదించిన ఎం మాణిక్‌రావు, మొదటిసారి తిరుగుబాటు బ్యానర్ ఎగరేసిన విద్యార్థి ఉద్యమనాయకుడు మల్లిఖార్జున్, ప్రజా ఉద్యమం నుంచి ఎన్నికల పరంగా విజయం సాధించిన ఎస్వెంకటరామా రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అచ్యుత రెడ్డి, రాజమల్లు, హాయగ్రీవాచారి, టి. అంజయ్య, కుముద్నాయక్, కె.రామచంద్రారెడ్డి, ఐరేణి లింగయ్య లాంటి ప్రముఖులను ఫొటోలతో సహా ‘చాంపియన్స్ఆఫ్తెలంగాణ’ పేరిట జైతెలంగాణలో ప్రచురించారు.
సుదీర్ఘకాలం ఆయన పత్రిక నడిపారు. మొత్తం ఉద్యమ సమయంలో పీవీ నర్సింహారావుతో దేశాయికి ప్రత్యేక అనుబంధం ఉన్నది. పీవీ ప్రధాని అయిన తర్వాత ఇంటి స్థలంతోపాటు కొన్ని పదవులు ఇచ్చేందుకు ప్రయత్నించగా దేశాయి తీసుకోలేదు. ఆయన నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా జర్నలిస్టుగా ఉండేందుకు ఎవరి నుంచీ ఏమీ తీసుకోలేదు. అయితే దేశాయికి తెలియకుండానే పీవీ నర్సింహారావు యూనియన్బ్యాంక్ఆఫ్ఇండియా డైరెక్టర్‌గా నామినేట్‌చేశారు. చాలా రోజుల తర్వాత బ్యాంక్ఆఫీసర్లు ఆయన ఇంటికి వస్తే గానీ ఆ విషయం దేశాయికి తెలియలేదు. ఆయన చివరి వరకు హైదరాబాద్ లోని నల్లకుంటలోనే ఓ చిన్న ఇంట్లో గడిపారు. 2003లో అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కాలం చేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా.. వారు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. దేశాయి కమిట్మెంట్గల జర్నలిస్ట్అని ఎన్టీఆర్ప్రశంసిస్తే, నిజమైన స్వాతంత్ర్య యోధుడని మాజీ సీఎం టి. అంజయ్య కొనియాడారు. దేశాయి ఆదర్శవాది అని కొండా లక్ష్మణ్‌బాపూజీ ప్రశంసించారు.
– కాశెట్టి కరుణాకర్,వెలుగు ప్రతినిధి