కేసీఆర్ కాళ్లు మొక్కి వెంకట్రామిరెడ్డి టికెట్ తెచ్చుకున్నారు : కొండా సురేఖ

కేసీఆర్ కాళ్లు మొక్కి వెంకట్రామిరెడ్డి టికెట్ తెచ్చుకున్నారు : కొండా సురేఖ

బీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదన్నారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ కాళ్లు మొక్కి టికెట్ తెచ్చుకున్నారని ప్రజలను మోసం చేయడం కోసం వస్తున్నారని విమర్శించారు. ఎంపీలుగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవగానే బీజేపీకి తాకట్టు పెడతారని ఆరోపించారు. సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తన సొంత లాభం కోసం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిందని విమర్శించారు.  

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కొండా సురేఖ గుర్తు చేశారు. తెలంగాణ నుండి 14 నుండి 15 ఎంపీ సీట్లు గెలిచి సోనియా గాంధీకి ఇవ్వాలని సూచించారు.  కార్యకర్తలతోనే ప్రభుత్వాలు వస్తాయని  ప్రతి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఆరు గ్యారెంటీల గురించి చెప్పాలని సూచించారు. బీసీ బిడ్డ నిరుపేదంలో కుటుంబంలో పుట్టిన నీలం మదును గెలిపించాలని కొండా సురేఖ కోరారు.