24  నుంచి బీసీ గురుకుల టీచర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : గురుకుల సెక్రటరీ సైదులు

24  నుంచి బీసీ గురుకుల టీచర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : గురుకుల సెక్రటరీ సైదులు
  •  ఒరిజినల్స్​తో హాజరవండి 

హైదరాబాద్, వెలుగు: గురుకుల టీచర్ల రిక్రూట్ మెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అపాయింట్ మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థులు ఈ నెల 24 నుంచి నిర్వహించే సర్టిఫికెట్​ వెరిఫికేషన్ కు హాజరు కావాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో సంత్ సేవాలాల్ బంజారా భవన్ లో ఈ నెల 24న ఉదయం పది గంటల నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని ఆయన కోరారు. 24న  లైబ్రేరియన్(స్కూల్, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ), ఫిజికల్ డైరెక్టర్, (జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ), డిగ్రీ లెక్చరర్స్ అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు. 25న జేఎల్​ (ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ), 26న జేఎల్​ (హిందీ, తెలుగు, గణితం), పీజీటీ (తెలుగు, హిందీ), 27న పీజీటీ (ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్), ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్-II, 28న టీజీటీ (హిందీ, బయోలాజికల్ సైన్స్, సోషల్‌‌‌‌‌‌‌‌) 29న టీజీటీ (ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్‌‌‌‌‌‌‌‌) 30న టీజీటీ (తెలుగు, గణితం) అభ్యర్థులు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు షెడ్యూల్ లో ఇచ్చిన తేదీల వారీగా  హాజరు కావాలని సైదులు సూచించారు. అభ్యర్థుల ఫోన్​ నంబర్లకు మెసేజ్ లు పంపించామని ఆయన తెలిపారు.