న్యూఢిల్లీ: హ్యుం డాయ్ మోటార్ ఇండియా మిడ్ సైజ్ సెడాన్ వెర్నాలో కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.9.3 లక్షల నుంచి రూ.15.09 లక్షలుగా ఉంది. ఈ కొ త్త వెర్షన్ పేరును ‘స్పిరిటడ్ న్యూ వెర్నా’గా పెట్టింది. బీఎస్ 6 కంప్లియెంట్‌లో మూడు ఇంజిన్ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. 1.5 లీటరు పెట్రోల్, డీజిల్ వేరియంట్‌ను, పెట్రోల్ 1 లీటరు టర్బో ఇంజిన్‌ను దీనిలో పొందుపర్చింది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లను కూడా ఆఫర్ చేస్తోంది. సెడాన్ సెగ్మెంట్‌లో స్టయిలింగ్, పర్‌ఫార్మెన్స్, టెక్నాలజీ, సేఫ్టీ విషయంలో ఈ వెహికల్ కొ త్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేస్తుందని హ్యుండాయ్ ఇండియా ఎండీ, సీఈవో ఎస్ ఎస్ కిమ్ తెలిపారు.
ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, పడల్ షిఫ్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లను ఈ కొత్త కారులో హ్యుండాయ్ ఆఫర్ చేస్తోంది. ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్, వెహికల్ స్టెబులిటీ మేనేజ్ మెంట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, రియర్ డిస్క్ బ్రేక్, ఫ్రంట్ పార్క్ అసిస్ట్ సెన్సర్ లు వంటి
సేఫ్టీ ఫీచర్లున్నాయి.

