జర్మనీ టెక్నాలజీ.. ఎగిరే ఎలక్ట్రిక్​ ట్యాక్సీ!

జర్మనీ టెక్నాలజీ.. ఎగిరే ఎలక్ట్రిక్​ ట్యాక్సీ!

ఎగిరే ఎలక్ట్రిక్​ ట్యాక్సీ ఇది. విమానం లాంటిదే అనుకోండి. ఐదుగురు ఎంచక్కా ప్రయాణించే దీనిని కంపెనీ విజయవంతంగా గాల్లోకి ఎగిరించి టెస్ట్​ చేసింది. వర్టికల్​ టేకాఫ్​ అండ్​ ల్యాండింగ్​ కెపాసిటీ దీనిసొంతం. జర్మనీకి చెందిన టాక్సీ స్టార్టప్​ సంస్థ లిలియం దీన్ని తయారు చేసింది. దీనికి మొత్తం 36 ఇంజన్లుంటాయి. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఒక్కసారి చార్జ్​ చేస్తే 128 కిలోమీటర్లు ప్రయాణించగలదు. లండన్​ నుంచి మాంచెస్టర్​కు జస్ట్​ గంటలో వెళ్లిపోవచ్చని సంస్థ చెప్పింది. టెయిల్​, రడ్డర్​, ప్రొపెల్లర్లు, గేర్లు లేకుండానే దీన్ని రూపొందించారు. అవసరమైతే డ్రోన్​గానూ దీన్ని వాడుకోవచ్చట.